ప్రమాదంలో గాయపడిన జనసైనికులకు ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు

జనసేన

            కడప ( జనస్వరం ) : రాజుపాలెం మండలం కొండమోడు గ్రామం వీరమ్మ కాలనీలో జనసేన పార్టీ నాయకులు బొర్రా అప్పారావు ప్రమాదంలో  దెబ్బతిన్న మల్లికార్జునకు 10000 రూపాయలు ఆర్థికసాయం చేయడం జరిగింది. అలాగే గ్రామంలో అనారోగ్య0తో బాధపడుతున్న అనంతరవమ్మకి 5000 ఆర్ధిక సాయం అందించడం జరిగింది. ఈ పర్యటనలో రాజుపాలెం మండలం అధ్యక్షుడు తోట రసయ్య, ఉపాధ్యక్షుడు హనుమంతరావు, మండల కార్యదర్శి తమ్మిశెట్టి మహేష్, మండల కార్యదర్శి కంభంపాటి ప్రసాద్ రావు, గ్రామ అధ్యక్షుడు శ్రీను, భాషా, జానీ మరియు గ్రామ జనసైనుకులు పాల్గొనటం జరిగింది.

See also  తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీ తరుపున మున్సిపల్ ఎన్నికల పోరులో అత్యధికంగా జనసేన వీర మహిళలు