అనంతపురం ( జనస్వరం ) : వాల్మీకి బోయల స్థితిగతుల అధ్యయనం కొరకు ఏర్పాటు చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శామ్యూల్ ఆనంద్ కుమార్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ ను ఖండిస్తున్నామని అనంతపురం జిల్లా జనసేన నాయకులు పత్రికా ముఖంగా తెలియజేశారు. వాల్మీకులను మోసం చేసే రకంగా కార్యచరణ చేస్తే రాయలసీమలో అత్యధిక ఎమ్మెల్యేలను గెలిపించినటువంటి వాల్మీకి బోయలు వైసీపీ ప్రభుత్వాన్ని కూల దోస్తామని హెచ్చరించారు. జనసేన పార్టీ నాయకులు జిల్లా అధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, రాప్తాడు ఇంచార్జ్ పవన్ కుమార్, జయమ్మ ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో వాల్మీకి బోయిలను ఎస్టీ జాబితాలకు చేరుస్తానని మొదటి అసెంబ్లీ సమావేశాల్లోని వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలోకి చేరుస్తానని చెప్పిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లి ఆంధ్ర రాష్ట్ర సమస్యల పైన అనేక విజ్ఞాపన పత్రాలు సమర్పిస్తుంటారు కదా… వాటిలో వాల్మీకి బోయల సమస్యల మీద మీరు ఒక్కటైనా కూడా విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చారా ??? జగన్ రెడ్డి గారు అడిగినా అడగకపోయినా కేంద్ర ప్రభుత్వమునకు మద్దతు తెలుపుతుంటారు.. కదా మరి ఎందుకు వాల్మీకి బోయిల సమస్యలను కేంద్రం పెద్దల దగ్గర ప్రస్తావించలేకపోతున్నారు. వైసీపీకి చెందిన ఎంపీలు కేంద్ర పెద్దల దగ్గర వాల్మీకి బోయల అంశపై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేక పోతున్నారు. గడచిన మూడున్నర సంవత్సరాలలో వాల్మీకి బోయల సమస్యలు గుర్తుకు రాలేదు. కేంద్ర ప్రభుత్వమునకు సమర్పించిన విజ్ఞాపన పత్రాలలో ఈ వైసీపీ ప్రభుత్వానికి వాల్మీకి బోయల సమస్యలు ఎందుకు గుర్తుకు రాలేదు ఎలక్షన్లకు సంవత్సరం ముందర మీరు వేసిన ఏకసభ్య కమిషన్ చూస్తా ఉంటే కాలయాపన కోసమే అని మాకు అనిపిస్తా ఉందన్నారు. ఇప్పుడు వేసిన శామ్యూల్ కమిటీ ఏక సభ్య కమిషన్ వాల్మీకి బోయల బతుకుల్ని కాలరాయడానికా అని జనసేన పార్టీ ద్వారా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు సుబ్రహ్మణ్యం కమిషన్ పేరిట వాల్మీకి జీవితాలను మోసం చేస్తే, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి శామ్యూల్ కమిషన్ పేరిట వాల్మీకి బోయల బతుకుల్ని కాలరాసేలా కనిపిస్తున్నాడు. నిజంగా వాల్మీకి బోయల బతుకులు తెలియాలంటే రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో సందర్శించి చూడండి వాల్మీకి బోయల బతుకులు ఏ రకంగా ఉన్నాయి వారి జీవన విధానం ఏ రకంగా ఉంది. కులవృత్తి లేక కొన్ని వేల కుటుంబాలు వలసలు వెళ్తున్నారు. ఒకసారి ఆలోచించండి ఉపాధి లేక పొట్టకూడి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లినటువంటి బతుకులుని ఒకసారి వెలికి తీయండి. ఎంతో ఉన్నత చదువు చదివి ఉద్యోగాలు లేక కూలి పని చేస్తున్నటువంటి నిరుద్యోగులు బతుకులను ఒక్కసారి బయటికి తీయండి, వేటకు వెళుతూ జీవనం సాగిస్తున్న వాల్మీకి బోయల బతుకులు ని ఒకసారి గమనించండి అని జనసేన పార్టీ ద్వారా డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా తీవ్ర వెనుకబడిన ఒక సామాజిక వర్గం యొక్క అభ్యర్థనను మన్నించి వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలోకి చేర్చేరకంగా ఈ ప్రభుత్వం కార్యచరణ రూపొందించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, రాప్తాడు నియోజకవర్గం ఇంచార్జ్ సాకే పవన్ కుమార్,జిల్లా సంయుక్త కార్యదర్శి విజయలక్ష్మి, బుక్కరాయసముద్రం మండల అధ్యక్షుడు ఎర్రి స్వామి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొనడం జరిగింది.