విజయనగరం ( జనస్వరం ) : విద్యాశాఖ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ పై జనసేన నాయకులు ఆదాడ మోహనరావు విరుచుకుపడ్డారు. గణతంత్ర దినోత్సవం నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రం విభజన ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందని,దానికి కొందరు అప్పటి నాయకులు కొందరు రాష్ట్రానికి ద్రోహం చేశారని అన్న మాటలకు, హుటాహుటిన బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం ఏర్పాటు చేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలను చేశారు.. ఈ వాఖ్యలను ఖండిస్తూ శుక్రవారం ఉదయం ఆదాడ మోహనరావు పత్రికా సమావేశం ఏర్పాటుచేసి ఆయన మాట్లాడుతూ… ఉత్తరాంధ్ర ను అభివృద్ధి కోసం కాకుండా మీ స్వాలాభాల కొసం,మీ రాజకీయ ఎదుగుదల కోసం,ఆస్తులను పెంచుకొని,దాచుకోవడం కోసం మీరు పాటు పడ్డారే తప్పా… ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం మీరేమి చేయలేదని,కనీసం ఒక్క పరిశ్రమ గానీ,యువతకు,ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించటంలో పూర్తిగా విఫలమయ్యారని,ఉత్తరాంధ్ర ద్రోహులు మంత్రులు ధర్మాన ప్రసాద్,బొత్స సత్యనారాయణ పై విరుచుకుపడ్డారు. కనీసం రాజ్యాంగంపై అవగాహన లేని,రాజకీయ సన్నాసులు మీరేనని ఏద్దేవా చేశారు.గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్న నాయకుడు బొత్స సత్యనారాయణ, నీతికి, నిజాయితీ మారుపేరైన పవన్ కళ్యాణ్ ను అనే అర్హత మీకు లేదని, మీ తాటాకు చప్పుళ్లకు జనసేన బెదిరేది లేదని, ఇకపైన అవాక్కులు చవాకులు వాగితే జనసేన చూస్తూ ఊరుకొదని.. హెచ్చరించారు. సమావేశంలో జనసేన నాయకులు రేగిడి లక్ష్మణరావు, త్యాడ రామకృష్ణారావు(బాలు) పాల్గొన్నారు.