విజయవాడ ( జనస్వరం ) : స్థానిక పోతిన రామారావు వీధి తమ్మిన గురవమ్మా సత్రం వద్ద 74 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని, రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజికవర్గ ఇంచార్జ్ మరియు నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ జండా వందనం చేసారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రాజు లేని రాజ్యంగా ప్రతి పౌరుడు ప్రజాస్వామ్యబద్ధంగా రాజు కాగల గొప్ప దేశo మనదని, దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు, సమాన హోదా రాజ్యాంగం ద్వారా కల్పించిన గొప్ప రోజని, వివిధ మతాలు, వివిధ భాషలు, వివిధ ప్రాంతాలు ఉన్న భారతదేశంలో అందరికీ సమాన హక్కులు రాజ్యాంగం ద్వారా కల్పించిన గొప్ప ప్రజాస్వామ్య దేశమని, ప్రపంచ దేశాల్లో భారతదేశం ప్రజాస్వామ్యానికి గొప్ప నిదర్శనమని కొనియాడారు. రాజకీయ లబ్ధి కోసం కొంతమంది కావాలనే ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని కాబట్టి ప్రజలందరూ ఈ అంశాన్ని గ్రహించాలని మహేష్ కోరారు.రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీస్తూ వైఎస్ఆర్సిపి పాలన చేస్తుందని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాకుండా సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తుందని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రాంతాలు మధ్య కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, జగన్ గారు ఒకపక్క రైతులు కౌలు రైతులకు అన్యాయం చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులను ఆదుకునే రైతు బంధు అయ్యారని, పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం కుటుంబాన్ని వదులుకున్నారని జగన్మోహన్ రెడ్డి పదవి కోసం కుటుంబాన్ని వదులుకున్నారని, రాబోయే రోజుల్లో జగన్ గారి నిరంకుశ పరిపాలన ప్రజలు చరమ గీతం పాడతారని, పవన్ కళ్యాణ్ గారి లాంటి ఉత్తమ నాయకులని అందలం ఎక్కిస్తారని, అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజా సమస్యల పైన నిత్యం పోరాడుతున్నామని అందుకనే పశ్చిమ నియోజకవర్గంలో మూడు సింహాల కాపాడినందుకు , హిందూ హైస్కూల్ ఇక్కడ ఉండాలని అందుకు, షాది ఖానా కోసం పోరాడినందుకు, విద్యుత్ ఛార్జీల మీద పోరాడినందుకు, కేటి రోడ్డు దుస్థితి పైన పోరాడినందుకు, నిరుద్యోగ యువత కోసం జాబ్ కాలండర్ కోసం పోరాడినందుకు, అక్రమ కేసులు పెట్టారని ఎన్ని కేసులు పెట్టినా ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటామని అన్నారు .అనంతరం పిల్లలకు బిస్కట్ల్, చాక్లెట్లు పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ అధ్యక్షులు పోట్నూరి శ్రీనివాసరావు , నగర ఉపాధ్యక్షులు కామల్ల సోమనాదం, నగర అధికార ప్రతినిధి స్టాలిన్ శంకర్, రేకపల్లి శ్రీను, మొబీనా శ్రీదేవి దుర్గా రాజేష్ తదితరులు పాల్గొన్నారు.