చిత్తూరు ( జనస్వరం ) : ఉమ్మడి చిత్తూరు జిల్లా వీర మహిళా విభాగం ఆధ్వర్యంలో మొట్ట మెదటి నియోజకవర్గ స్థాయి వీర మహిళా సదస్సు గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం మండలం సుద్ద గుంట గ్రామంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిలుగా, రాయల సీమ వీర మహిళా విభాగం.రీజినల్ కోఆర్డినేటర్, Dr ఆకుల వనజ, ,స్టేట్ సెక్రటరీ ఆకేపాటి సుభాషిణి, చిత్తూరు జిల్లా లీగల్ కమిటీ ఉపాధక్షురాలు శ్యామల, తిరుపతి పట్టణ కార్యదర్శి లక్ష్మి, సీనియర్ నాయకురాలు తోట జయంతమ్మ, కత్తుల. లతాదేవి, పుష్ప విజయరెడ్డి, నవ్య రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రీజనల్ కోఆర్డినేటర్ ఆకుల వనజ మాట్లాడుతూ మహిళలు ఆర్ధిక ప్రగతి సాధించాలని రాజకీయాల్లో మహిళలు చురుకైన పాత్ర పోషించాలని, పూర్వీకుల అడుగు జాడల్లో మహిళలు ప్రేరణ పొందాలని, ఎందుకు జనసేనలో మహిళలకు తగిన ప్రోత్సాహo అందిస్తామని తెలిపారు. నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కు ఒక్కసారి అవకాశం ఇవ్వండి శుద్ధగంట గ్రామాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా, నియోజకవర్గంలోని 255 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతామని శపథం చేశారు. రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిని మాట్లాడుతూ జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మక్కిపోయిన బియ్యం బదులు ప్రతి రేషన్ కార్డు కలిగి ఉన్న మహిళకు 2500 నుండి 3500 వరకు ఇవ్వడం జరుగుతుందని, సంవత్సరానికి ఆరు గ్యాస్ బండలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, తద్వారా పేదరిక నిర్మూలనకు కృషి చేస్తుందని తెలిపారు. చిత్తూరు జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షురాలు కంచి శ్యామల మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబనకు జనసేన కృషి చేస్తుందని, మహిళలకు ఇబ్బందులు ఎదురైతే జిల్లా న్యాయవిభాగం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని తెలిపారు. సీనియర్ నాయకురాలు తోట జయంతి మాట్లాడుతూ రాజకీయాల్లో మహిళలు చురుకైన పాత్ర పోషించాలని తెలిపారు. సీనియర్ నాయకులు విజయ రెడ్డి మాట్లాడుతూ జగనన్న కన్నా పవన్ అన్న మిన్న అని తెలిపారు. శర్మ మాట్లాడుతూ మీరందరూ గాజు గ్లాసు మీద గుద్దితే, ఫ్యాన్ విరిగి కింద పడాలని తెలిపారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సేవా దృక్పథం నచ్చి, జనసేన పార్టీ సిద్ధాంతాలను మెచ్చి, పాలసముద్రం మండలానికి చెందిన రేవతి జనసేన పార్టీ లో చేరారు. వీర మహిళా విభాగం దుశ్యాలువ కప్పి సన్మానించారు ఈ కార్యక్రమంలో కార్వేటి నగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, ఉపాధ్యక్షులు విజయ్, సురేష్ రెడ్డి, సెల్వి, లోకేష్ పెనుమూరు మండల అధ్యక్షులు శ్రీనివాసులు, పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్, ఎస్ఆర్ పురం మండల సీనియర్ నాయకులు సుధాకర్, వెదురుకుప్పం మండల సీనియర్ నాయకులు యతీశ్వర్ రెడ్డి, గంగాధర్ నెల్లూరు మండల్ ప్రధాన కార్యదర్శి రాము, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, కార్వేటినగరం టౌన్ కమిటీ నాయకులు శేఖర్ రెడ్డి, చంద్ర,జనసైనికులు గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.