జనసైనికుడి కుటుంబానికి వచ్చిన పెన్షన్ ఇవ్వలేదని ఎం‌పి‌డి‌ఓ ఆఫీసు ఎదుట వంటావార్పు కార్యక్రమం

జగన్

          జగ్గంపేట ( జనస్వరం ) : కిర్లంపూడి మండలం వేలంక గ్రామంలో ప్రభుత్వం మంజూరు చేసిన పెన్షన్లను వికలాంగులైన బాధితులకు అందనీయకుండా, వచ్చిన పెన్షన్‌ సొమ్మును వెనక్కి పంపించిన వైయస్సార్‌ పార్టీ నాయకులపై చర్యలు తీసుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పేదల పట్ల ఆయనకున్న తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్‌ పాఠంశెట్టి సూర్యచంద్ర డీమాండ్‌ చేశారు. మండల కేంద్రం కిర్లంపూడి లో వేలంకలో జరిగిన అన్యాయాన్ని ఎండగడుతూ పెన్షన్లు కోల్పోయిన బాధితులకు మద్దతుగా స్థానిక మండల అభివృద్ధి కార్యాలయం ఎదురుగా జనసేన పార్టీ కార్యకర్తలు ఏర్పాటుచేసిన వంటావార్పు  కార్యక్రమంలో సూర్యచంద్ర తన సతీమణి అయినా పాటంశెట్టి శ్రీదేవితో పాల్గొని వైయస్సార్‌ పార్టీ నాయకులు అనుసరిస్తున్న దురాలోచన విధానాలపై విరుచుకుపడ్డారు. వాస్తవంగా చెప్పాలంటే జనవరి 1న జరిగిన ఈ అన్యాయాన్ని మండల అభివృద్ధి అధికారి బి. సతీష్‌ బాబు దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ, అవతల ఉన్నది అధికారపక్షం కావడం వల్ల ఎంపీడీవో బాధితులకు ఏ విధమైన న్యాయం చేయలేకపోవడం దారుణం. అందుచేతనే నియోజకవర్గ ఇంచార్జ్ పాఠంశెట్టి సూర్యచంద్ర తెల్లవారేవరకు జన సైనికులతో ఎంపీడీవో కార్యాలయం వద్దనే నిరీక్షించి మంగళవారం ఉదయం వంటావార్పు  కార్యక్రమానికి సంసిద్ధమయ్యారు. అన్నదే తడువుగా వంట సామాగ్రిని తెప్పించి జనసేన నాయకులు సమక్షంలో ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా వంటావార్పుకి శ్రీకారం చుట్టి వైయస్సార్‌ పార్టీ నాయకులపై ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం అని నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంచార్జ్  పాఠంశెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి, లేదా స్థానిక శాసన సభ్యుడైన ఎక్కడైనా మాట్లాడితే పార్టీలకతీతంగా పార్టీలకతీతంగా అంటున్నారే  తప్ప అది క్షేత్రస్థాయిలో వారి పార్టీ కార్యకర్తలు అనుసరించడం లేదన్న సంగతి గుర్తించుకోవాలని ఆయన హితవు పలికారు. అలా కాకపోతే ముఖ్యమంత్రి గా లేదా ఎమ్మెల్యేగా మీరు వికలాంగులకు వృద్ధులకు మంజూరు చేసిన పెన్షన్‌ తాలూకా సొమ్మును ఎవదో గ్రామస్థాయి నాయకుడు అడ్డుకోవదం ఏమిటని సూర్యచంద్ర ఎత్తిచూపారు. “ఏది ఏమైనా అధికారుల నుండి వెనక్కి వెళ్ళిపోయిన సొమ్మని తిరిగి రప్పించి బాధితులకు అందించడంతోపాటు అందుకు కారకులైన స్థానిక నాయకులు పై చర్యలు తీసుకునే వరకు తాను చేస్తున్న పోరాటం వెనక్కు తగ్గేదే లేదని ఆయన తెగేసి తిప్పారు. ఈ ఆందోళనలో పాఠంశెట్టి శ్రీదేవి, పాఠంశెట్టి సత్తిబాబు, అలాగే జనసైనికులు కలిసి ఐరాజ్‌, గంధం ప్రభాకర్‌, ఎలుబంటి శివ, సూరంపాలెం బాలు, రామకృష్ణాపురం విజయ్‌, ఎద్దు వీరబాబు, నూకల సాయి, సూరంపాలెం శివ, చిట్నీడి సురేంద్ర, పాతిరెడ్డి శేఖర్‌ తదితర జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way