ఏలూరు ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ నెల 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరగనున్న యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జనసేన పార్టీ ఏలూరు ఇన్చార్జ్, యువశక్తి ప్రచారకర్త రెడ్డి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. శనివారం నర్సీపట్నం ఎన్జీఒ హోమ్ లో జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజాన వీర సూర్యచంద్ర ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.. ఈ యువశక్తి సమావేశానికి పెద్ద ఎత్తున యువకులు వచ్చేటట్లు చూడాలన్నారు.. ప్రస్తుత పరిస్థితిలో ప్రజలు జనసేన వైపు చూస్తున్నారన్నారు.. ఈ అవకాశాన్ని జన సైనికలు ఉపయోగించుకొని జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించాలన్నారు.. యువశక్తి అంటే యువత అని, రేపు భవిష్యత్ అంతా వాళ్లచేతిలో ఉందన్నారు.. ప్రతీ జన సైనికులు కనీసం వంద మందిని తీసుకురావాలన్నారు..యువత తమ గళం వినిపించేలా యువశక్తి కార్యక్రమానికి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారన్నారు.. యువత తమ ఆలోచనల గురించి, వారి కష్టాల గురించి, వారి భవిష్యత్ గురించి గళం వినిపించేలా యువశక్తి కార్యక్రమం ఉండనుందన్నారు.. రణస్థలం వేదికగా ఏర్పాటు చేస్తున్న యువశక్తి సభను విజయవంతం చేయాలని కోరారు.. అనంతరం సూర్యచంద్ర మాట్లాడుతూ నర్సీపట్నం నియోజకవర్గంలోని నాలుగు మండలాలతో పాటు మున్సిపాలిటీ నుంచి పెద్ద ఎత్తున యువత యువశక్తి కార్యక్రమానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.. యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జనసైనికులు కృషి చేయాలని కోరారు.. అనంతరం యువశక్తి పోస్టర్లను ఆవిష్కరించారు.. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం మున్సిపాలిటీ అధ్యక్షులు అద్దేపల్లి గణేష్, జనసేన నాయకులు గండెం దొరబాబు, శానపతి శేషు, బైన మురళీ, కొత్తకోట రామశేఖర్, పి.నాగు, చిరంజీవి శ్రీను, కర్రి సురేష్, చప్పా నానాజీ, బల్ల అశోక్, సంతోష్, వేగిశెట్టి శ్రీను, జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.