ఏలూరు ( జనస్వరం ) : శ్మశాన వాటికలో మృతదేహాల ఖననానికి రూ.5000 ఫీజు వసూలు చేయాలనే కౌన్సిల్ తీర్మానం 53 వ నెంబర్ ను రద్దు చేయాలి. కాటి కాపర్లకు మున్సిపల్ సిబ్బంది గా గుర్తించి వేతనాలు అమలు చేయాలి.. ఏలూరులో విద్యుత్ శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలి.. శ్మశాన వాటికలో కనీస సౌకర్యాలు మౌలిక సదుపాయాలు కల్పించాలని తీర్మానం 53 వ నెంబర్ ను రద్దు చేయాలని కోరుతూ ఈరోజు ఏలూరులోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద అఖిల పక్షాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టిన పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ డిసెంబర్ 13వ తేదీన ఏలూరులో ఉన్న ప్రజలకు గ్రహణం పట్టింది.. చనిపోయిన ప్రతి ఒక్క డెడ్ బాడీ మీద 5000 రూపాయలు వసూలు చేయాలనే దుర్మార్గపు తీర్మానం నంబర్ 53 ను ఏలూరు కార్పొరేషన్ మేయర్ గారు, వారి యొక్క కార్పొరేటర్లు, స్థానిక శాసనసభ్యులు సిగ్గులేకుండా ఒక తీర్మానం చేసి స్మశాన వాటికల్లో సౌకర్యాలు కల్పించడం పోయి స్మశాన వాటికల్లో ఉన్న సిబ్బందికి జీతాలు ఇవ్వడం, ప్రజలకు ఫ్రీ సర్వీసు చేయాలని చెప్పాల్సిన నాయకులు సిగ్గు లేకుండా ఒక తీర్మానం చేసి ఐదు వేల రూపాయలు ప్రతి డెడ్ బాడీకి వసూలు చేయడం దుర్మార్గపు చర్య.. ఇది శవాల మీద పేలాలు ఏరుకునే పరిస్థితి.. దీనిని అఖిలపక్షంగా తీసుకుని స్థానిక శాసనసభ్యులకు చెబుదామని అఖిల పక్షం తో కలిసి వెళితే కనీస గౌరవం లేదని, ప్రజా సంఘాలు ప్రతిపక్ష నాయకులు ప్రజా శ్రేయస్సు కోసం వచ్చారని శాసనసభ్యుడికి ప్రజల యొక్క విజ్ఞప్తులను విందాం అనే వాళ్లు ఇచ్చే రిప్రెజెంట్లను తీసుకుందామని ఈ యొక్క తీర్మానాన్ని క్యాన్సిల్ చేయాలనే జ్ఞానం లేనటువంటి ఎమ్మెల్యే కనీసం వాళ్లకు ఇంటర్వ్యూలు ఇప్పిస్తున్నారని ఇలాంటి ఎమ్మెల్యేలు, ఇలాంటి మేయర్లు, ఇలాంటి కార్పొరేటర్లు నగర ప్రజలకు అవసరమా అని రెడ్డి అప్పలనాయుడు ప్రశ్నించారు.. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఎమ్మెల్యే గారు, మేయర్ గారు తీర్మానం 53 వ నెంబర్ నీ క్యాన్సిల్ చేయాలనే ఎక్కడ కూడా డబ్బులు వసూలు చేయకుండా సిబ్బందికి మేము జీతాలు ఇస్తున్నాము.. విద్యుత్ సౌకర్యాలు కల్పిస్తాం.. అప్పుడు ఏలూరు ప్రజలు హర్షిస్తారు..ప్రజాసంఘాలు కూడా హర్షిస్తాయని ఈ దిక్కుమాలిన తీర్మానాన్ని రద్దు చేయాలని జనసేన పార్టీ నుండి అఖిలపక్షం ద్వారా డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు..