🔸 వికలాంగుల హక్కుల పోరాట సమితి ధర్నాకు జనసేన నాయకుల మద్దతు
🔸తొలగించిన దివ్యాంగుల పెన్షన్లను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్
🔸దివ్యాంగులకు న్యాయం జరిగేవరకు జనసేన అండగా నిలుస్తుందని వెల్లడి
విజయనగరం ( జనస్వరం ) : జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు కళ్యాణం పైడి నాయుడు ఆధ్వర్యంలో దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని కలక్టరేట్ ఎదుట చేస్తున్న ధర్నాకు మద్దతుగా జనసేన పార్టీ నాయకులు గురాన అయ్యలు, ఆదాడ మోహనరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేనపార్టీ నాయకులు గురాన అయ్యలు మీడియాతో మాట్లాడుతూ దివ్యాంగులకు తొలగించిన పెన్షన్లు తక్షణమే పునరుద్ధరించాలని, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి, ఎలాగూ ప్రజలకు న్యాయం చేయట్లేదని,కనీసం దైవ సమానులైన దివ్యాంగులకు వాళ్ళ హక్కుల కోరికలైన సదరం సర్టిఫికెట్ ను ఆధారం చేసుకుని మాత్రమే పింఛన్లు ఇవ్వాలని, ఏ ఇతరకారణాల వలనా వాటిని తొలగించకూడదని, పద్దెనిమిదేళ్లు పైబడిన దివ్యాంగులకు ప్రత్యేకమైన వ్యక్తిగత రేషన్ కార్డులను జారీ చేయాలని,దివ్యాంగులను వారి కుటుంబీకుల హౌస్ మాపింగ్ వెంటనే తొలగించాలని,వారి కుటుంబాల్లో ఉద్యోగస్తులు లేక నాలుగు చక్రాలు వాహనాలు ఉన్నాయని పెన్షన్లు తొలగించిన వారందరి పెన్షన్లను వెంటనే తిరిగి పునరుద్దించాలని,వికలాంగుల పెన్షన్ మూడువేల రూపాయలనుండి, ఆరువేలకు పెంచాలని,వికలాంగుల చట్టం 2016 ను వెంటనే అమలు చేయాలని,కళ్యాణ మస్తు పధకం క్రింద దివ్యాంగులకు ఇచ్చే రూ.1,50,000/- ఈ ప్రధకం జి.ఓ లో పదవ తరగతిని మినహాయింపు చేయాలని,మోటార్ వాహనాలను నిరంతర ప్రక్రియగా చేసి అర్హులైన వారందరికీ ఇవ్వాలని,ఈ ప్రధకం జి.ఓ లోకూడా పదవ తరగతి ను మినయించాలని,ప్రభుత్వం దివ్యాంగులకు ప్రస్తుతం ఇవ్వబోయే స్కూటీలు సంబంధించిన నియోజక వర్గాల వారిగా సెలక్షన్ లిస్టు వెబ్ సైట్ లో కానీ వికలాంగుల సంక్షేమ శాఖ నోటీసు బోర్డులో వెంటనే పెట్టాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని రంగాల ప్రజానీకానికి ఇబ్బందులు పెడుతుండడంతో పాటు, దివ్యాంగుల పొట్టమీద కొట్టడాన్ని భగవంతుడు క్షమించడని, కనీసం దివ్యాంగుల కార్పొరేషన్ చైర్పర్సన్ ముంతాజ్ పటాన్ కార్పొరేషన్ చైర్పర్సన్ గా బాధ్యతలు తీసుకున్నా.. దివ్యాంగులకంటూ ఎటువంటి న్యాయం చేయలేదని వాపోయారు. ఇకనైనా ప్రభుత్వం వీరి గోడును ఆలకించి,దివ్యాంగులకు న్యాయం చేయాలని కోరారు. లేదంటే జనసేన పార్టీ తరుపున,రాజకీయ,ప్రజా సంఘాలను కలుపుకుని దివ్యాంగులకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు), ఎంటి రాజేష్ పాల్గొన్నారు.