విజయనగరం ( జనస్వరం ) : ప్రజలకు ఏ కష్టం వచ్చినా జనసేన పోరాడుతుంది అందుకే పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారు. జగన్ సీఎంగా ప్రజలకు కష్టాలు కన్నీల్లే మిగిల్చారు, పింఛన్లను దౌర్జన్యంగా తొలగించారు, జగన్ కలెక్టర్లను తిట్టాలని కార్యక్రమం మొదలుపెట్టాలి అని చెప్పటం దుర్మార్గం, మీరు రాజకియాలకు ఆనర్హులు,ప్ర జలకు ఏ కష్టం వచ్చినా జనసేన పార్టీ ముందుండి పోరాడుతుందని అందుకే మా పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం నియోజకవర్గ ఇన్చార్జ్ పాలవలస యశస్వి గారు అన్నారు. ఆమె మాట్లాడుతూ యువత జనసేన పార్టీని ఆదరించడం సంతోషంగా ఉందన్నారు. జగన్ సీఎం అయినప్పటి నుంచి ప్రజలకు కష్టాలు కన్నీల్లే మిగిల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అవ్వతాతల పింఛన్లు, వితంతువుల పింఛన్లు, దివ్యాంగులు పించన్లను తొలగించడానికి జగన్‌కు మనసెలా వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వం పింఛన్లను దౌర్జన్యంగా తొలగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల పింఛన్లు తొలగించి నేతలు రాజకియాల్లో ఎలా ఉండగలుగుతున్నారని ప్రశ్నించారు. అంత మంది పింఛన్లను తొలగించి ఏ విధంగా గడపగడపకు వెళ్తున్నారని నిలదీశారు. అర్హులకు పింఛన్ ఇచ్చేంత వరకు జనసేన పార్టీ పోరాడుతూనే ఉంటుందని అవసరమైతే ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జనసేన పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అనంతరం కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ గణపతి రావు గారికి వినత పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళ మాతా గాయత్రి, జిల్లా సీనియర్ నాయకులు డా.రవికుమార్ మిడతాన, దంతులూరి రామచంద్ర రాజు, మోపాడా అనిల్, మజ్జి శంకర్, రవిరజు చౌదరి, హుస్సేన్ ఖాన్, వాసు, సూర్యారావు, అప్పలనాయుడు, జన సైనికులు పాల్గొన్నారు.