రాజంపేట ( జనస్వరం ) : నియోజకవర్గ పరిధిలోని టి. సుండుపల్లి మండల అధికారులు వారికి వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు రద్దు చేసిన విషయం పట్ల భాదితులతో కలిసి వినతిపత్రాలు అందజేసిన జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్. ఆయన మాట్లాడుతూ ఏదో చిన్న చిన్న కారణాలు చూపి నోటీసులు జారీ చేసి తొలగిచిన పెన్షన్లు తిరిగి పునరుద్దరించాలని కోరారు. సుండుపల్లి మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఇటీవల ప్రభుత్వం వారు అన్ని రకాల పెన్షన్లు సుమారు 200 వరకు ఏదో కారణం చేత నోటీస్ ద్వారా తొలగించడం జరిగింది. సదరు తొలగించిన పెన్షన్ల పై గ్రామాల్లోని పల్లెలు వారీగా పెన్షన్లు దారుల వద్దకు వెళ్ళి విచారించగా…భూమి లేని వారికి, ఇళ్ళు లేని వారికి, 4 చక్రాలు వాహనాలు లేని వారికి, ఆదాయపన్ను లేని వారికి, వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఇలా చాలా రకాలుగా పెన్షన్ మీద ఆధారపడి వారి జీవనాధారం కొనసాగిస్తున్న వారికి కూడా పై వాటిలో ఏదో కారణం చూపి రద్దు చేశారు. కావున దయవుంచి విచారణ చేపట్టి వారికి తగు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు, జనసైనికులు, పెన్షన్లు కోల్పోయి దిగులు పడుతున్న భాదితులు, తదితరులు పాల్గొన్నారు.