రండి… తరలిరండి… యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

యువశక్తి

      పాలకొండ ( జనస్వరం ) : జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యువశక్తి కార్యక్రమం జనవరి 12వ తేదీన రణస్థలంలో జరుగుతుంది. జనసేన పార్టీ అధినేత  పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు యువతని రాజకీయాల్లోకి అడుగులు వేయించాలనే తపనతో జనసేన పార్టీ యువతకి భరోసాన్ని కల్పించడానికి యువశక్తి అనే కార్యక్రమాన్ని నిర్వహించబోతుంది. ఈ కార్యక్రమానికి పాలకొండ నియోజకవర్గం యువత హాజరై విజయవంతం చేస్తారని కోరుకుంటు గ్రామ గ్రామాలలో యువశక్తి కార్యక్రమం కోసం యువతను బలోపేతం చేసేవిధంగా పాలకొండ నియోజకవర్గంలో ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బీపీ నాయుడు, అల్లు సాయిరాం కుమార్, మత్స పుండరీకం, జనసేనజానీ, ప్రశాంత్ పోరెడ్డి, రమేష్ పొట్నూరు, జామి అనిల్, కడ్రక సాయి తదితరులు పాల్గొన్నారు.

See also  జనసేన కార్యకర్తకి ఇన్సూరెన్స్ చెక్కును అందజేసిన జనసేన యువ నాయకులు గెడ్డం చైతన్య