ఏలూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి సచివాలయాలు వాలంటీర్లు, ఈరోజు వాలంటీర్ కి సచివాలయ సిబ్బందికి ప్రజాధనంతో జీతాలు ఇస్తున్నామని కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి సచివాలయ సిబ్బందులను,వాలంటీర్లను వైయస్సార్ పార్టీ కార్యకర్తలుగా పని చేయించుకునే ఆదేశాలను చూస్తున్నామని రెడ్డి అప్పల నాయుడు అన్నారు.. ఈ రోజున ఏలూరులోని వన్ టౌన్, టూ టౌన్ ఉన్నటువంటి 79 సచివాలయాలలో దాదాపు 1400 మంది వాలంటీర్ పనిచేస్తున్నారు.. ప్రజలను ఏదో విధంగా ఒకసారి మోసం చేయగలిగాం.. ఈసారి ప్రజలు తిరగబడే పరిస్థితి ఉందని, దీనికి ముందుగానే మోసాలు కుట్రలతో ప్రజలను వంచించాలనే ఆలోచనతో నిన్న క్లస్టర్ కి సంబంధించిన వాలంటీర్ గృహ సారధులు ఇద్దరు వాలంటీరు ముగ్గురు కలిపి 5ఏళ్ళు పని చేయాలి.. అదేవిధంగా సచివాలయాలకి ముగ్గురు కన్వీనర్లు, ముగ్గురు కన్వీనర్ చెప్పినట్టుగా ఆ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి సచివాలయం 15 ,20 మంది వాలంటీర్లు ఉన్నారు.. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పనిచేయాలని ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం జన్మభూమి కమిటీలను పెట్టి ప్రజలను వంచించిందని అనేక రకాల విమర్శలు చేసినటువంటి నేటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఈనాడు వాలంటీర్లను పార్టీ క్యాడర్ ని ఒక రథసారథిగా వాడటం మీ ఒక్కడికే చెల్లిందని విమర్శించారు.. లేకపోతే వైయస్సార్ పార్టీ ఎమ్మెల్యే మేయర్లు మీరేమైనా డబ్బులు ఇస్తున్నారా ? ప్రజల సొమ్మునే వాళ్లకు జీతాలు గా ఇస్తున్నారు.. అదే విధంగా వైయస్సార్ పార్టీకి మీరు పని చేయాలి.. కార్యకర్తగా గతంలో కూడా వాళ్ల పార్టీ సెక్రటరీ ఈ విధంగానే చెప్పుకున్నారు..వాలంటీర్లుతో మనం వైయస్సార్ పార్టీ కార్యకర్తలుగా పని చేయాలని వైయస్సార్ ప్రభుత్వాన్ని వైయస్సార్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని వాలంటీర్ అందరి మీద ఉందని మీ అధ్యక్షుడు చెప్పడం సిగ్గుగా లేదా మీకు అని ప్రశ్నించారు.. మీటింగ్ లో ఈ సందేశాలను పంపిస్తున్నారు ..ఇది ఎంత దుర్మార్గం.. వాలంటీర్లను కట్టు బానిసలుగా వాడుకుంటున్నారు.. వాళ్లకు ఐదు వేల రూపాయలు శాలరీ కాదు కనీస మినిమం వేతనం ఇవ్వాలని, టెన్త్ ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలు జీవితాలు 5000 కి పరిమితం చేసి వాళ్లతో వెట్టి చాకిరిచేయించుకుంటున్నారని రెడ్డి అప్పలనాయుడు హెచ్చరించారు.. వాళ్లకు రేపు ఏదైనా సమస్యలు వేస్తే మాలాంటి సంఘాలు గాని, ప్రతిపక్షాలు గాని మినిమం వేతనం ఇవ్వాలని జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం.. హక్కుల కోసం సంఘాలు పెట్టుకోవాలని, పార్టీని గెలిపించే ఉద్దేశం ఎమ్మెల్యే గారిని సూటిగా ప్రశ్నిస్తున్న.. మీరు వాళ్లకి జీతాలు మీ పాకెట్ నుంచి ఇస్తున్నారా ? మీ ఆస్తులు ఏమైనా అమ్మి ఇస్తున్నారా ? మీరు ఏ రకంగా వాళ్ళని మీ పార్టీకి పని చేయించుకుంటారని ఎదురు ప్రశ్నించారు…ఇవాళ ప్రజలను మీ పెన్షన్లు పీకేస్తామని, మీ చేయూతను లాగేస్తామని మోసాలకు గురిచేస్తున్నారు.. మీకు ఇస్తున్నటువంటి అమ్మ ఒడిని మీరు గనక వైఎస్ఆర్ సీపీకి సపోర్ట్ చేయకపోతే ఆ వాలంటీర్ తోనే బెదిరిస్తున్నారు.. రాష్ట్రం లో ప్రజలను మోసం చేసే ప్రక్రియకు పునాది పడిందని, ప్రజలందరూ గమనిస్తున్నారు..ఈ రోజున పెన్షన్ గాని ఒంటరి మహిళ గానీ ఎవరైతే చెప్పులు కుట్టే సోదరులు ఉన్నారో వాళ్లకు వచ్చే పెన్షన్లు కానీ, ఎవరైతే కళాకారులు ఉన్నారో వాళ్లకు వచ్చే పెన్షన్లు, ఇవాళ 300 యూనిట్లు కరెంట్ సాకు చెప్పి పీకేస్తున్నారు.. లేదా 120 గజాల స్థలంలో 1080 చదరపు చదరపు అడుగుల ఇల్లు ఉన్నాయని పీకేస్తున్నారు.. ఒక పక్కన సంక్షేమాన్ని అందిస్తున్నామని చెప్పి మీరు దోచుకున్న ప్రక్రియను కొనసాగిస్తున్నారు.. దీనికి స్థానికంగా ఉన్నటువంటి మేయర్ గారు ఎమ్మెల్యే గారు వారి యొక్క బృందం ప్రజలను నిట్టనిలువుగా మోసం చేస్తున్నారు.. వాలంటీర్లతో మన సమాచారాన్ని ఆ యొక్క వాలంటీర్ ద్వారా మన వద్ద ఉన్న గోప్యంగా ఉన్న సమాచారాన్ని సేకరించి వాళ్ల ప్రజలు మనోభావాలను దెబ్బతీసే ఒక కుట్ర జరుగుతుంది.. ప్రజానీకం అంత గమనిస్తున్నారు..మీ పార్టీ యంత్రాంగాలు ఎంతమందినైనా పోషించుకోండి… మీ పార్టీ కార్యకర్తలని నాయకులని ఎంతమందినైనా పోషించుకోండి..వాళ్లకి మీ సొంత డబ్బులు జీతాలుగా ఇచ్చుకోండి.. కానీ వాలంటీర్లను ఈ యొక్క ఎలక్షన్ నుంచి తప్పించండి..జనసేన పార్టీ దీనిని తీవ్రంగా ప్రతిఘటిస్తుంది.. ప్రశ్నిస్తుంది.. దీనిమీద తిరగబడుతుంది..రేపు పొద్దున్న మీరు ఇంటింటికి వెళ్తున్నప్పుడు పొరపాటున ప్రజల యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తున్నాం.. ఇప్పటికైనా అలాంటి ఆలోచనలని మానుకోవాలని, విరమించుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఏలూరు జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం.. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్,నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ఉపాధ్యక్షులు గుబ్బల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కావూరి వాణిశ్రీ,ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, కార్యదర్శి కందుకూరి ఈశ్వరరావు, నాయకులు నిమ్మల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు..