నెల్లూరు ( జనస్వరం ) : సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట 227వ రోజున 15వ డివిజన్ బాలాజీనగర్ CPR డొంక ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ తిరిగిన కేతంరెడ్డి ప్రజా సమస్యల అధ్యయనం చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల హాజరు పేరుతో వారి వ్యక్తిగత మొబైల్ ఫోన్లలో ప్రభుత్వ యాప్ ను ఇంస్టాల్ చేయడం వారిపై నిఘా ఉంచేందుకే అనే అనుమానాలున్నాయని అన్నారు. హాజరు కోసం అయితే సంబంధిత కార్యాలయాల్లో బయోమెట్రిక్ యంత్రాలనో, ఐరిస్ యంత్రాలనో ఉంచి రెండు లేదా మూడు పూటలా హాజరు తీసుకోవచ్చని కానీ ఫేస్ రికగ్నిషన్ పేరుతో ఫోన్లో సమాచారాన్ని సంగ్రహించే యాప్ ని ఇంస్టాల్ చేయించడం ఏమిటని అన్నారు. ఇది ఉద్యోగుల వ్యక్తిగత భద్రతకు ప్రమాదం అని అన్నారు. ప్రభుత్వ తీరుపై నిరాశతో, ఆవేదనతో ఉండే ఉద్యోగులను పసిగట్టి వారిపై కక్షపూరిత చర్యలకు పాల్పడే అవకాశాలు లేకపోలేదని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.