తిరుపతి ( జనస్వరం ) : సామాజిక ఫించన్ల తొలగింపుపై తిరుపతిలో జనసేన నిరసన ఫించన్ టంచన్ అంటూ కోట్లాది రూపాయిలు ఖర్చు చేసి మరీ పేపర్లలో ప్రకటనలతో ఆర్బాటాలు చేసిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇప్పుడు లక్షలాది మంది ఫించన్లు తొలగించి వారి ఉసురు కొట్టుకుంటున్నారని జనసేన పార్టీ తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డి ఆరోపించారు. ఫించన్ మీదే ఆధారపడి జీవించే నిరుపేద వృద్దులకు వేల ఎకరాల భూములు ఎలా వస్తాయో సీఎంకే తెలియాలన్నారు. ఆన్ లైన్ లో తప్పులు దొర్లితే విచారణ చేపట్టకుండా నోటీసులు ఇస్తారా అని నిలదీశారు. ఫించన్ల తొలగింపు నోటీసులపై తిరుపతి నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అర్హులైన లబ్దిదారులకు వెంటనే ఫించన్లు పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ.. ఫించన్లు నిలిపివేసి అవ్వాతాతలకు వృద్ధాప్యంలో భరోసా లేకుండా చేస్తారా? పాదయాత్రలో నెల్లిన చేతులు పెట్టి నిమిరిన మీరు ఆవ్వా, తాతలకు చేస్తోంది అన్యాయం కాదా? మోసం కాదా? మూడేళ్ల క్రితం చనిపోయిన వారు బతికొచ్చి టాక్సులు ఎలా కడతారు. సొంతిల్లు ఉంటే ఫించన్ ఎత్తివేయడం ఏంటి? ఇల్లు ఉంటే అన్నం ఎవరు పెడతారు? వయసు మళ్లిన అవ్వాతాతలంటే బటన్ రెడ్డికి ఎందుకంత పగ అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో మీకు ఓట్లు వేశారన్న కనికరం కూడా చూపరా? కొత్త ఏడాది ఫించన్ లో రూ. 250 కలుస్తుంది అన్న ఆశతో ఉన్న వారి ఆశల మీద నీళ్లు చల్లుతారా? ఫించన్ ఎత్తేసేందుకు మీరు చూపే కారణాలు సహేతుకంగా లేవు. వృద్ధుల ఉసురు కొట్టుకోవద్దు జగన్ రెడ్డి. బటన్ నొక్కి అద్భుత పాలన చేస్తున్నాననుకుంటున్న మీరు ఆ డబ్బు ఎవరి ఖాతాలకు చేరుతుందో తెలుసుకోకపోతే ఎలా? తప్పు జరిగింది సరి చేస్తాం అని చెప్పాల్సిన మీరు చేసిన తప్పుని సమర్ధించుకోవడం ఏంటి? మీకు మీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 26 వేల మందికి ఫించన్ రద్దు చేసినట్టు నోటీసులు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 60 వేల మంది ఫించన్ కట్ చేసేందుకు సిద్ధమయ్యారు, వారికి నోటీసులు కూడా ఇచ్చారు ఇప్పటికే అర్హత ఉన్న లక్షలాది మంది ఫించన్లు తీసేశారు. గడప, గడపన మీ ఎమ్మెల్యేలు, మంత్రుల దగ్గర లబ్దిదారులు మొరపెట్టుకున్నా కనికరం చూపడం లేదని అన్నారు. స్పందించే మనసు లేని ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డిని అభివర్ణించారు. ఫించన్లు పునరుద్దరించే వరకు జనసేన పార్టీ తరఫున బాధితులకు అండగా ప్రత్యక్ష పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు ఆకేపాటి సుభాషిణి, శ కీర్తన, వనజాక్షి, లక్ష్మి, సత్యవంతుడు, రాజమోహన్, మునుస్వామి, రాజేష్ ఆచారి, హిమవంత్, సుమన్, మనోజ్, హేమంత్, సాయిదేవ్, కిషోర్, గోపిస్వామి, ఆదికేశవులు, భాను ప్రకాష్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.