విజయనగరం ( జనస్వరం ) : పట్టణంలోని స్థానిక ఆర్.టి.సి.కాంప్లెక్స్ వద్దనున్న జి.ఎస్.ఆర్. కాంప్లెక్స్ లో గిరి, జనసేన ఆత్మీయ సభను జనసేన నాయకులు, రాష్ట్ర గిరిజన నాయకుడు తుమ్మి అప్పలరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసభకు ఉత్తరాంధ్ర నియోజకవర్గాల గిరిజన ముఖ్య నాయకులు పాల్గొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి గిరిజనలు ఎదుర్కొంటున్న సమస్యలు,గిరిజనులు కోల్పోయిన హక్కులపైన అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది, అలాగే గిరిజన గ్రామాల్లో జనసేన పార్టీ బలోపేతం చేయడానికి,పార్టీ చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు, గిరిజన యువతకు తెలిసేలా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ మధ్యనే పార్టీలో చేరిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, జనసేన నాయకులు గురాన అయ్యలును గిరిజనులు, జనసేన నాయకులు మర్యాద పూర్వకంగా సన్మానం చేయడం జరిగింది. అనంతరం జనసేన పార్టీ కురుపాం నియోజకవర్గ నుండి జనసేన పంచాయతీ సర్పంచ్ గా గంగాధర్ ను సత్కారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర మహిళా కోఆర్డినేటర్ తుమ్మి లక్ష్మీ రాజ్, రాష్ట్ర దళిత నాయకుడు, జనసేన నాయకులు ఆదాడ మొహన్,విజయనగరం జిల్లా లీగల్ సెల్ ప్రెసిడెంట్ రాజేంద్ర, గిరిజనులను ఉద్దేశించి గిరిజన చట్టాలు, హక్కులు గూర్చి ఐఖ్యత కొరకు జనసేనపార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాట్లాడారు, అలాగే శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన నాయకులు సాలాచన సఖ్ముకరావు మన్యం జిల్లానుండి వచ్చిన నాయకులు మీనక చిన్నారావు, ఉత్తరాంధ్ర నాయకులు హక్కులు, చట్టాలు కోసం మాట్లాడుతూ జనసేన నియోజకవర్గాల్లో, గ్రామాల్లో జనసేన బలోపేతం చేయడానికి ఉద్దేశించి మాట్లాడారు, ఈ కార్యక్రమంలో పల్ల సురేష్, తిమ్మక బాబూరావు, శివ,జనసేన పార్టీ బలోపేతం చేయడానికి ఆదివాసీ హక్కులు కాపాడుకునేందుకు విలువైన సందేశం ఇవ్వడం జరిగింది.