గంగాధర నెల్లూరు ( జనస్వరం ) : కార్వేటి నగరం మండలం, పద్మ సరస్సు గ్రామంలో రైతు కోసం జనసేన కార్యక్రమానికి నియోజకవర్గం ఇంచార్జి డా. యుగంధర్ పొన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న రైతులకు రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. డా. యుగంధర్ మాట్లాడుతూ.. వ్యవసాయం ప్రతిక్షణం ఎగిసిపడే కెరటం, ప్రపంచానికి సాయం చేయడానికి ప్రతిసారి పడి లేస్తుంది, అందుకే అది అమృతం.. అందరికీ రైతన్న ఆదర్శం అని తెలిపారు. వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది, అగ్రికల్చర్ అనే మాటలోనే కల్చర్ ఉంది. ప్రపంచానికి కల్చర్ని, సాయం చేసే గుణాన్ని నేర్పిన ఒకే ఒక్క స్ఫూర్తి రైతన్న అని కొనియాడారు. ఈ ప్రపంచంలో అందరూ మట్టిని మట్టిలా చూస్తే, కేవలం రైతు మాత్రమే మట్టిని బంగారంలా బంగారం పండిస్తాడని తెలిపారు. మనం నిలబడటానికి ఆధారం అయిన నేల నుంచి సిరులు పండించే శ్రామికుడు రైతు. మనం జీవించడానికి అవసరమైన శక్తిని ఇచ్చే ఆహారాన్ని సమకూర్చే అన్నదాత రైతు. మనం శ్వాసించడానికి ప్రాణ వాయువును ఇచ్చే మొక్కలను పెంచే ప్రకృతి పుత్రుడు రైతని తెలియజేసారు. ప్రకృతి విలయాలకు ఎదురొడ్డి పంట సాగు చేసే సైనికుడు రైతు. పక్షులను, పశువులను మచ్చిక చేసుకుని కాపాడే జంతు ప్రేమికుడు రైతు. వ్యవసాయం తన వృత్తి, తోటి మనిషికి సాయం తన ప్రవృత్తని కొనియాడారు. దేశానికి అన్నం పెట్టడం కోసం అన్నపానీయాలు మరిచిపోయి, అహర్నిశలు కృషి చేసే రైతన్నకు వందనాలని తెలిపారు. దేశానికి అన్నం పెట్టే రైతు, నేడు ఆకలితో అలమటిస్తున్నాడు. ప్రజల ఆకలి తీర్చే వ్యవసాయదారుడు, నేడు పరాయి కుతంత్రాలకు బలి అవుతున్నాడు. పంటనే నమ్ముకున్ను కృషివలుడు, నేడు ప్రకృతి విలయాలకు విలవిలలాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసారు. ఉద్యోగికి సెలవొచ్చినా కంపెనీలకి తాళం పడినా ప్రభుత్వాలే స్తంభించినా ఆగిన ప్రపంచాన్ని నడిపించేందుకు పరిగెత్తేవాడే రైతన్న అని సంతోషం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.