విజయనగరం ( జనస్వరం ) : జనసేన పార్టీ ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవంను పురస్కరించుకొని, పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మెరకముడిదం మండలం ఇప్పలవలసా గ్రామంలో పార్టీ సీనియర్ నాయకులు మరియు రౌతు కృష్ణవేణి ఆధ్వర్యంలో రైతు దినోత్సవ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి రైతులతో ముందుగా మండల అధ్యక్షులు నాయకులు రౌతు క్రిష్ణ వేణి, రేగిడి లక్ష్మణరావు గారు విజయనగరం జిల్లా కార్య నిర్వహణ కార్యదర్శి ,,మాట్లాడుతూ జనసేన అదినేత పవన్ కళ్యాణ్ తన బంగారు జీవితాన్ని మన బడుగు, బలహీన,అణగారిన వర్గాల కోసం త్యాగం చేసిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, రాష్ట్రంలో రైతుల పక్షాన నిలబడే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని, ప్రభుత్వం చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలకు ఇస్తామన్న నష్టపరిహారం ఇవ్వట్లేదని,రైతులకు సరియైన గిట్టుబాటు ధర ఇవ్వట్లేదని,ఎరువులు,విత్తనాలు రైతులకు సరియైన సమయంలో ఇవ్వడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం విఫలమైందని,కనీసం పంటపొలాలకు ఇస్తామన్న ఉచిత విద్యుత్ కూడా అందించలేక పోతున్నారని,రైతు లేనిదే ప్రభుత్వం లేదని ప్రగద్భాలు పలికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో అన్ని కొనాల్లోను విఫలమైందని అన్నారు. రాష్ట్రంలో రైతు భరోసా యాత్ర పేరుతో చనిపోయిన కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి, ప్రతీ ఒక్క కుటుంబానికి లక్ష రూపాయల చప్పున ఇస్తూ,ఆ కుటుంబంలో ఉన్న పిల్లల భవిష్యత్ కోసం, చదువులకోసం ప్రత్యేకమైన నిధిని కూడా పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారని, పవన్ కళ్యాణ్ రైతులకోసం చేస్తున్న పలు సేవలను వివరించారు. మరో నాయకులు సాసుబిల్లీ రామునాయుడు మాట్లాడుతూ రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని, అటువంటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు, పవన్ కళ్యాణ్ తన సొంత కష్టార్జితాన్ని రైతులకు సహాయం చేస్తున్న ఆపద్భాదవుడు అని కొనియాడారు. అనంతరం రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని రైతులకు వినోద్, చిన్నం నాయుడు, బంటుపల్లి శంకర్, లంక పేట రామకృష్ణ, పైల ధనుంజయ్, చిన్నమనాయుడు, కర్లం, పి సత్యనారాయణ జనసేన పార్టీ నాయకులు సత్కరించారు, ఈ కార్యక్రమంలో మెరకముడదం మండలం జనసేన నాయకులు పార్టీ కార్యకర్తలు అభిమానులు, వీర మహిళలు పాల్గొనడం జరిగింది.