గుడివాడ ( జనస్వరం ) : పట్టణ స్థానిక ఏలూరు రోడ్డు కోర్టు ప్రాంగణం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్ వల్ల ఒక వాహనదారుడు అదుపుతప్పి పడిపోవడంతో తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఈ విషయం తెలుసుకున్న గుడివాడ పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ వంశీ, Rk వారియర్స్ తెలియజేయగా గుడివాడ పట్టణ ట్రాఫిక్ పోలీస్ సంప్రదించి ఆ స్పీడ్ బ్రేకర్స్ కి ఇరువైపులా ప్రమాద సూచికలు ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ (Rk) మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సమాజం మీద బాధ్యత నిర్వహించాలని ఈ స్పీడ్ బ్రేకర్ వల్ల వాహనదారులు ఇబ్బంది పడడంతో స్పందించిన గుడివాడ పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ వంశి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని తెలియజేశారు. ఎవరికి వారు బిజీ లైఫ్ లో ఉండి సమాజాన్ని పట్టించుకునే నాధుడే లేడు ఎవరు ఏమైపోతున్న నాకెందుకులే అనే ఆలోచన గానీ సమాజానికి సేవ చేయాలని ప్రతి ఒక్కరికి ఉండాలి. గుడివాడ పట్టణ మున్సిపల్ అధికారులకి మా యొక్క విన్నపం ఏమిటంటే స్పీడ్ ని కంట్రోల్ చేయడానికి స్పీడ్ బ్రేకర్లు వేశారు అది మంచి ఆలోచన కానీ కొత్తగా వేసిన స్పీడ్ బ్రేకర్ వల్ల వాహనదారులు తెలియక అనేక ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి దయచేసి ఇలాంటి వేసినప్పుడు ప్రమాద సూచికలు ఏర్పాటు చేస్తే ప్రమాదాలు జరగవని మా ఆలోచన అలాగే ఏలూరు రోడ్ లో ఉన్న విద్యుత్ లైట్లు కూడా సరిగ్గా పని చేయకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు దయచేసి మా విన్నపాన్ని మన్నించి తగిన మరమ్మతులు చేయవలసిందిగా కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన డాక్టర్ వంశీ గారికి, ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాద్ గారికి, మరియు మా జన సైనికులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని తెలియజేశారు.