Search
Close this search box.
Search
Close this search box.

ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ విడుదల చేసిన 53 నెంబర్ తీర్మానాన్ని వెంటనే రద్దు చేయాలి

     ఏలూరు, (జనస్వరం) : ఏలూరు నియోజకవర్గంలో మున్సిపల్ కార్పొరేషన్ వారు ఇటీవల విడుదల చేసిన 53 నెంబర్ తీర్మానాన్ని వెంటనే రద్దు చేయాలని ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గంలో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ లో నిన్న జరిగినటువంటి తీర్మానాల్లో 53వ తీర్మానంలోని సారాంశం అయిన చనిపోయినటువంటి డెడ్ బాడీల మీద కూడా ఏలూరు కార్పొరేషన్ వ్యాపారం చేయాలనుకుని తీర్మానం చేసిందని ఇంతకంటే దిగజారుడు పరిపాలన ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా ఉండదనేది స్పష్టంగా ఈ తీర్మానాల ద్వారా మనకు అర్థమవుతుందన్నారు. అదేంటంటే ఏ డెడ్ బాడీ అయినా సరే దహన సంస్కారాలు చేయడానికి 5000 రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ కి కట్టాలని అక్కడ పనిచేస్తున్నటువంటి కాటికాపర్లుగా ఉన్న వాళ్ళందర్నీ మైంటైన్ చేయాలని 5000 రూపాయలు ఒక్కొ డెడ్ బాడీకి కట్టాలని తీర్మానం చేశారు..ఈ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కానీ ఈ పాలకవర్గంకాని ఎన్నుకున్నటువంటి సభ్యులు ఏం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఒక పేదవారు ఎవరైన చనిపోయినప్పుడు చాలా స్వచ్ఛంద సంస్థలైన ఫ్లాష్ సంస్థ,మానవతా అనే స్వచ్ఛంద సంస్థ కావచ్చు అనేక స్వచ్ఛంద సంస్థలు ఫెజర్ బాక్సులు గాని వెహికల్ గాని ప్రొవైడ్ చేస్తున్నాయని అన్నారు. చనిపోయిన డెడ్ బాడీ నీ తీసుకెళ్లి ఒక 500, 1000 రూపాయలు కట్టెలు కొనుక్కుని వెళ్లి ఒక 500 కాటి కాపరికి ఇస్తే ఒక రెండు మూడు వేలు లో దాహన సంస్కారాలు అయిపోతున్నాయి. ఇంత చెత్త ప్రభుత్వం చెత్తపై పన్ను వేసి చెత్త ఆలోచనలు కలిగినటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఏలూరు కార్పొరేషన్ వారు గాడిదలు కాస్తున్నారా అని తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. ఇవాళ 5000 రూపాయలు ప్రతి బాడీకి చాలాన కట్టాలని తీర్మానించడం ఇంతకంటా నీచమైన దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నాయాని వాటిని ఈ జనసేన పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, మీరు కార్పొరేషన్ నుంచి కోట్లాది రూపాయలు పన్నులు కలెక్ట్ చేస్తున్నారని వాటిని కాటికాపరికి జీతం ఇవ్వాలని, అక్కడ మెయింటినెన్స్ చూసుకోవాలని సూచించారు. అంతేకానీ ఇప్పుడు 5000 రూపాయలు అడిగి, రేపు పొద్దున్న వాళ్ళ కిడ్నీలు కూడా అమ్మేసే పరిస్థితి తెస్తారని ఏలూరు మున్సిపాలిటీ అధికారులను మేయర్ ని వీళ్ళందరికీ హెడ్ గా ఉన్న ఎమ్మెల్యే కూడా ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు చేస్తూ తీర్మానం చేయడం ఇంతకంటే దుర్మార్గమైన పని ఉండదని హెచ్చరిస్తూ జనసేన పార్టీ నుంచి ఈ తీర్మానం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, నాయకులు బోండా రాము నాయుడు, నిమ్మల శ్రీనివాసరావు, కందుకూరి ఈశ్వరరావు, రాచప్రోలు వాసు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way