అనంతపురం, (జనస్వరం) : అనంతపురం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, అర్బన్ నియోజకవర్గం ఇంచార్జ్ టి.సి.వరుణ్ వినూత్న ఆలోచనతో పార్టీ శ్రేణులను మమేకం చేస్తూ క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉంటూ ప్రజా సేవే లక్ష్యంగా జనసేన శ్రమదానం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒక్క ఫోన్ (9398854513) కాల్ చేస్తే చాలు 24 గంటల్లోపు గుంతలు పడ్డ రహదారులకు మరమ్మతులు చేసే విధంగా కార్యక్రమాన్ని రూపొందించారు. ఇందులో భాగంగా నగరంలోని స్థానిక సప్తగిరి సర్కిల్, అలాగే పాతూరులో ఉన్న పవర్ ఆఫీస్ వద్ద ఘోరంగా గుంతలు పడ్డ ప్రధాన రోడ్లను మరమ్మత్తులు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శిలు కుమ్మర నాగేంద్ర మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను క్షేత్రస్థాయిలో ఆచరణలో పెట్టాలన్న సంకల్పంతో జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ ఆధ్వర్యంలో నగరంలో గుంతలపడ్డ రోడ్లను మరమ్మతులు చేయించేందుకు సంకల్పించారు. రోడ్లను బాగు చేయాలని ఎన్నిసార్లు విన్నవించినా వైసిపి ప్రజాప్రతినిధులు, నగర పాలక అధికారులు పట్టించుకోవడం లేదు. నేరుగా మేము రంగంలోకి దిగాము అని అన్నారు. నగర మేయర్ కు చెందిన దుకాణం ఎదుట రహదారిపై గుంతలను కూడా పూడ్చుకోలేని దుర్గతిలో వైసీపీ నేతలు ఉన్నారని విమర్శించారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి రోడ్లు మరమ్మత్తులు చేపట్టాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము అని తెలియజేశారు. అదేవిధంగా అనంతపురం అర్బన్ పరిధిలోని 50 డివిజన్లో ఎక్కడైనా సరే రహదారికి మరమ్మత్తులు చేయాలని కోరుతూ ఫోన్ కాల్ చేస్తే 24 గంటల వ్యవధిలో మరమతలు చేస్తామన్నారు. ప్రజల ఇబ్బందులు పట్టని వైసిపి పాలనను ప్రజలు తిరస్కరించాలని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల అభ్యున్నతి కోసం అభిలాషించే జనసేన పార్టీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వీరమహిళ రూప, నగర ఉపాధ్యక్షులు గ్రంధి దివాకర్, జెక్కిరెడ్డి ఆదినారాయణ, జిల్లా కమిటీ సభ్యులు రాపా ధనుంజయ్, కిరణ్ కుమార్, సిద్దు, అవుకు విజయ్ కుమార్, ముప్పూరి కృష్ణ, పురుషోత్తం రెడ్డి, నగర ప్రధాన కార్యదర్శులు మేదర వెంకటేష్, హుస్సేన్, దరాజ్ భాషా, నగర కార్యదర్శిలు విశ్వనాథ్, మురళి, నెట్టిగంటి హరీష్, ఆకుల అశోక్, ఆకుల ప్రసాద్, ఎం.కృష్ణ, ఎర్రిస్వామి, నాయకులు పవనిజం రాజు, చరణ్, శ్రీనివాస్, హిద్దు, వడ్డే వెంకటేష్, మల్లి, నౌషాద్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.