-మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి
-అడుగడుగునా శాలువాలు, పూలమాలలు, మంగళ హారతులతో కేతంరెడ్డి వినోద్ రెడ్డికి స్వాగతం పలికిన ప్రజలు
-కేతంరెడ్డికి శ్రీ కృష్ణదేవరాయలు చిత్రపటాన్ని బహుకరించిన స్థానిక కాపు నేతలు
-పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకునే యజ్ఞంలో తొలి అడుగు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పడిందన్న కేతంరెడ్డి
-ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా రానున్న ఎమ్మెల్యే ఎన్నికల్లో తమ గెలుపుని ఆపలేరన్న కేతంరెడ్డి వినోద్ రెడ్డి
నెల్లూరు సిటీ ( జనస్వరం ) : నియోజకవర్గంలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట 212వ రోజున 15వ డివిజన్లో ఘనంగా ప్రారంభమైంది. స్థానిక జనసేన పార్టీ నాయకులు అంచల సారథి నేతృత్వంలో బాలాజీనగర్ కూడలి వద్ద నిలువెత్తు కటౌట్లు ఏర్పాటు చేశారు. తొలుతగా మినీబైపాస్ లోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన అనంతరం బాణాసంచా, తీన్మార్ డప్పుల సంబరాల నడుమ బాలాజినగర్ అన్నపూర్ణ అపార్ట్మెంట్ మీదుగా ప్రధాన వీధిలో పవనన్న ప్రజాబాట కార్యక్రమం సాగింది. ఇంటింటికీ వెళ్ళి కరపత్రాన్ని పంచుతూ ప్రజాసమస్యల అధ్యయనం చేస్తున్న కేతంరెడ్డికి దారి పొడవునా మహిళలు మంగళ హారతులు పట్టారు. శాలువాలు, పూలమాలలతో ప్రజలు సత్కరించారు. స్థానిక కాపు నేతలు శ్రీ కృష్ణదేవరాయలు చిత్రపటాన్ని కేతంరెడ్డికి బహుకరించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ప్రజలు పవనన్న ప్రజాబాట పట్ల చూపుతున్న ఆదరణ మరువలేనిదన్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నాటి నుండి నేటి వరకు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ముందుకు సాగుతూ ఉన్నామన్నారు. రోజురోజుకీ పెరుగుతున్న ప్రజాదరణ తమలో నూతనోత్సాహాన్ని నింపుతోందని, నగరంలో అధికార పార్టీ పతనానికి పవనన్న ప్రజాబాట పునాది అయిందని అన్నారు. ఎవరెన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా కూడా తట్టుకుని నిలబడే శక్తి తమకు ఉందని, రానున్న ఎన్నికల్లో తమ గెలుపుని ఆపలేరని, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకునే యజ్ఞంలో తొలి అడుగు నెల్లూరు సిటీ నియోజకవర్గం నుండే పడుతోందని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో అంచల సారథి, పావుజెన్ని చంద్ర శేకర్ రెడ్డి, అమంచర్ల శ్రీకాంత్, హేమంత్ రాయల్, జాఫర్, జీవన్, కుక్క ప్రభాకర్, పేనేటి శ్రీకాంత్, వర ప్రసాద్, వెంకటేశ్వరులు, సాయి, రాఘవ, దువాకర్, చిన్నా, ప్రసన్న, సుజన్ సింగ్, కేకే, పవన్ వీర మహిళలు ఝాన్సి, కుసుమ, కాయల మేరీ, ప్రీతి తదితరులు పాల్గొన్నారు.