అరకు – లకేపుట్టు గ్రామంలో డ్రైనేజ్ సమస్య పరిష్కారం చేయాలి : సాయిబాబా దురియా

అరకు

           అరకు ( జనస్వరం ) : నియోజకవర్గం పెదబయలు మండలము అడుగుల పుట్టు పంచాయితీ పరిధిలోగల లకేపుట్టు గ్రామంలో  జనసేన మాజీ (ఏంపిటిసి ) సాయిబాబా దూరియా. పల్టాసింగ్ ప్రశాంత్. జాగరపు పవన్ కుమార్ ఆధ్వరంలో ఆయా గ్రామంలో పర్యటించి గ్రామస్తులతో సమావేశం అయ్యారు. జనసేన మాటలు, జనసేన సిద్ధాంతాలు ఇంటింటికి తీసుకెళ్లారు. గ్రామాల్లో నెలకొన్న డ్రైనేజ్ సమస్యను పరిశీలించారు. ఈ సందర్భంగా ను డ్రైనేజ్ సమస్యను తక్షణమే పరిష్కారం చేయాలని గ్రామస్తులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతోనిరసన తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ మాజీ ఎంపీటీసీ సాయిబాబా మాట్లాడుతూ గిరిజనుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్పుకొని ఈ ప్రభుత్వం మారుమూల ప్రాంతమైన లకే పుట్టు (పిటిజి ) గ్రామాలలో కనీస మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలని ప్రభుత్వంపై ధ్వజమెత్తి మాట్లాడారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే డ్రైనేజీ మరియు రోడ్ల సదుపాయం, జగనన్న ఇల్లు కాలనీ నిర్మించి వాళ్ళని ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. దీనికి ముందు పర్యటించిన జనసేన పార్టీ నాయకులను గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సుమారు వందమంది గిరిజనులకు జనసేనపార్టీ నాయకులుమాజీ ఎంపిటిసి సాయిబాబా దురియా ఆధ్వర్యంలో బట్టలు ( వస్త్రాలు) పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జన సైనికులుపెదబయలు మండలం నుంచి కామరాజు, నాగరాజు, హుకుంపేట మండలం నుంచి చుంచు రాజు బాబు, పాడేరు మండలం నాయకులు. నందోలి మురళీ గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way