లక్కవరపుకోట, (జనస్వరం) : జనసేన నాయకులు రామెళ్ళ శివాజీ, రావాడ నాయుడు, షేక్ ఫిరోజ్, అలమండ రాంబాబు, పిల్లా సురేష్ ఆధ్వర్యములో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీని ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలి. కార్యచరణ ఎలా చేయాలని విశ్లేషణ చేసారు. అలాగే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఉండొచ్చనే ఊహాగానాలు గతంలో బలంగా వీచాయి. అందులో భాగంగా వచ్చే ఏడాది జూన్, జులైలో ఎన్నికలు ఉండొచ్చని తాజాగా మళ్లీ కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసైనికులు కథనరంగంలోకి దూకాల్సిన సమయం వచ్చింది. పార్టీ అధిష్టానం ఆదేశాల కోసం ఎదురు చూడకుండా మన పని మనం మొదలు పెట్టడం మంచిది. పదవులు ఎవరికి వచ్చాయి, గుర్తింపు దక్కిందా లేదా, అధిష్టానం వ్యవహారశైలి ఎలా ఉంది అనే అంశాలను పక్కనపెట్టి ఎన్నికల కోణంలోనే మన ఆలోచనా సరళి ఉండాలని అన్నారు. తాత్కాలిక అవరోధాలు, చిన్న చిన్న విషయాలు పట్టించుకొని వెనుకడుగు వేస్తే మళ్లీ ఐదేళ్లు బాధపడాల్సిందే. ఈ ఎన్నికలు జనసేనకు చాలా కీలకం. పార్టీని రక్షించుకునే కీలక సమయం. పాతికేళ్ల ప్రస్థానానికి ఈ ఎన్నికలు నాంది. బలమైన, దుర్భేద్యమైన జనసేనను నిర్మించుకోవడానికి సువర్ణావకాశం. పార్టీ బలపడితే పదవులు, హోదాలు, అవకాశాలు వాటంతటవే వస్తాయి. కాస్తా ముందు, వెనుక అంతే. కష్టపడే వాడికి ఏదో ఒకరోజు కచ్చితంగా స్థాయికి తగ్గ గుర్తింపు వస్తుంది. ఎవరి మీదో అలక, కోపంతో మనం వెనకడుగు వేస్తే నష్టపోయేది పార్టీ మాత్రమే కాదు మనం కూడా అని తెలిపారు. కాబట్టి మిత్రులు మనలో అంతర్గత విబేధాలు, చిన్న చిన్న మనస్పర్ధలు వీడి కదనరంగంలోకి దిగాలని అభ్యర్ధించారు. గ్రామాల్లో పార్టీ నిర్మాణంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మీ ప్రణాళికలు, ప్రయత్నాలు ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమములో ముఖ్య నాయకులు గొరపల్లి రవికుమార్, వేపాడ మండలం అధ్యక్షులు సుంకరి అప్పారావు, పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మల్లువలస శ్రీను తదితరులు ముఖ్య నాయకులను పాల్గొన్నారు.