ఆత్మకూరు ( జనస్వరం ) : పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలన్న దృఢ సంకల్పంతో, ప్రజల ఆశీర్వాదంతో కొనసాగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 34వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 66వ వర్ధంతిని పురస్కరించుకొని ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. తదుపరి పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని జమ్మలపాలెం, వందూరుగుంట ప్రాంతాలలో పర్యటించి ప్రతి ఇంటికి జనసేన పార్టీ కరపత్రాలను పంచుతూ, జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేస్తూ పవనన్న ప్రజాబాట సాగింది. ఈ ప్రాంత ప్రజల ఇబ్బందులను తెలుసుకొని జనసేన పార్టీ తరఫున తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ భరోసా ఇవ్వడం జరిగింది. మున్సిపల్ పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయని, ముఖ్యంగా డ్రైనేజీ సౌకర్యం,వీధి దీపాల వంటి కనీస సౌకర్యాలకు కూడా నోచుకోలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఈ సందర్భంగా శ్రీధర్ తెలిపారు. సకల సౌకర్యాలతో, ఆత్మకూరు మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలంటే ప్రజలందరూ జనసేన పార్టీకి ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఆత్మకూరు పరిధిలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ ఆవేదనను తెలియజేయడం జరిగింది. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తామంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చి, ఏరు దాటిన తర్వాత తెప్ప తగలబెట్టిన చందంగా, ఇప్పుడు ఉద్యోగుల మెడపై కత్తి వేలాడదీసే విధంగా కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పట్ల దొంగ డ్రామాలు ఆడడం సమర్థనీయం కాదని, ఈ ఉద్యోగులకు అండగా జనసేన పార్టీ పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వంశి, చంద్ర, సురేంద్ర, నాగరాజు, పవన్, తిరుమల, భాను, ఆనంద్, హజరత్, ఫణీంద్ర, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.