నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట 202వ రోజున 43వ డివిజన్ కంషాద్ వలి దర్గా ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగి ప్రజాసమస్యలను అధ్యయనం చేసి పోరాడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ గత ఎన్నికల ముందు ముస్లిం మైనారిటీలకు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఆ హామీలను తుంగలో తొక్కిందని, మైనారిటీలకు ప్రభుత్వం నుండి అందాల్సిన పథకాలు, రుణాల నిధులు అందట్లేదని, వక్ఫ్ ఆస్తులను కూడా నిర్వీర్యం చేసారని, ఆఖరికి చిన్న పిల్లలకు ప్రభుత్వం తరఫున జరిపే ఖత్నా కార్యక్రమం కూడా జరపలేకపోయారని దుయ్యబట్టారు. ఉర్దూని రెండో అధికార భాషగా ప్రకటించి చేతులు దులుపుకొన్నారని, కానీ ప్రతి ప్రభుత్వ శాఖలో, ప్రభుత్వ కార్యాలయాల్లో, గ్రామ వార్డు సచివాలయాల్లో నియమించాల్సిన ఉర్దూ ట్రాన్సలేటర్లను నేటికీ నియమించలేదని, కనీసం ఆ దిశగా కసరత్తు కూడా ఈ ప్రభుత్వం ప్రారంభించలేదని, ఈ అంశంలో కూడా ముస్లింలను వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోందని అన్నారు. నిజంగా ఈ ప్రభుత్వానికి ముస్లిం మైనారిటీల అభ్యున్నతి పై చిత్తశుద్ధి ఉంటే తక్షణం అన్ని ప్రభుత్వ శాఖలకు ప్రతి కార్యాలయంలో ఉర్దూ ట్రాన్సలేటర్ పోస్టులను విడుదల చేయాలని కేతంరెడ్డి వినోద్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.