అరకు ( జనస్వరం ) : జనసేనపార్టీ ఆరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు మాట్లాడుతూ ఆరకు నియోజకవర్గంలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం వందరోజులు పూర్తి అయిన సందర్భముగా సంబరాలు చేసుకోవడం కాదు గడప గడపకు తిరిగి సమస్యలు కల్లారా చూసారా అని ధ్వజమెత్తారు. ఎన్ని గ్రామాల్లో సమస్యలున్నాయి? ఎన్ని గ్రామాల్లో రోడ్లు ఉన్నాయి? ఎన్ని గ్రామాల్లో మంచి నీరు ఉంది ? గడప గడపలో తిరిగిన అధికారులు, స్థానిక శాసన సభ్యులు ఎన్ని సమస్యలు పరిష్కరించారని కోరారు. సమస్యలు తెలుసుకోవడానికి కార్యక్రమం చేశారా? సమస్యలు పరిష్కరించడానికి కార్యక్రమాలు చేస్తున్నారా ? గడప గడప కు కార్యక్రమలు చేసి ఎన్ని గ్రామాల్లో సమస్యలు గుర్తించారు ఎన్ని సమస్యలు పరిష్కరించారు వెంటనే ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు ఉన్నాయి బస్సులు లేవు? కొన్ని మారుమూల గ్రామాల్లో అసలు రోడ్లు లేని పరిస్థితి? మంచినీటి సదుపాయం లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఇవి గడప గడప కార్యక్రమంలో కనిపించలేదా ? అని నిలదీశారు. వందరోజులు పూర్తి చేసి సంబరాలు చేయడం కాదు ముందు గిరిజన గ్రామాలు అభివృద్ధి చేయండి అని జనసేనపార్టీ నాయకులు మాదాల శ్రీరాములు తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై మండిపడ్డారు.