మహబూబ్ నగర్ ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షుల పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలను వక్రీకరించి నిజానికి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో భూస్వాములు పెత్తందారుల మధ్య నలిగిపోయిన తెలంగాణ సమాజం ఆ కాలంలో ఓరి బియ్యం దొరికేవి కావని, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కుటుంబాలు నిజానికి ఓరి బియ్యం దూరంగా ఉన్నది నిజమేనని అలాగే తెలంగాణలో వ్యవసాయం పండించడం రైతులకు రాదని పండించే విధానం రైతులకి ఇక్కడ తెలంగాణ ప్రజలకు తెలియదని పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా వ్యాఖ్యానించలేదు. నిజానికి అప్పుడు తెలంగాణలో కూలీలు రైతు కూలీలు పేద వర్గాలకు జరిగిన అన్యాయం గురించి మాత్రమే వ్యాఖ్యానించారు. తెలంగాణలో 2002 సంవత్సరానికి ముందు ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారు అజ్ఞాతవాసంలో ఉన్న సమయంలో తెలంగాణలోని మారుమూల ప్రాంతాలకు వెళితే గద్దర్ గారితో ఒక మహిళ ఆ విషయం అన్నారు. పవన్ కళ్యాణ్ తో ఓ సందర్భంలో కలిసినప్పుడు అన్నారు అని అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ మొన్న ప్రస్తావించారు. ఆ విషయాన్ని తెలుసుకోకుండా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అతి ఉత్సాహంతో మాట్లాడడం సరైన విషయం కాదు తెలంగాణ వ్యాప్తంగా రైతుల సమస్యలు అనేకంగా ఉన్న పట్టించుకోకుండా, రైతుల పక్షాన నిలబడి వాళ్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లే క్రమంలో మంత్రిగారు పూర్తిగా విఫలం అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో కౌలు రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన కుటుంబాలకు 30 కోట్ల రూపాయల కేటాయించి ప్రతి కుటుంబానికి లక్ష చొప్పున తన సొంత కష్టా జీతాన్ని రైతుల కోసం పంచుతున్నారు. రైతు పక్షపాతి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని మూర్ఖుడు అని మాట్లాడడం మూర్ఖపు మంత్రికి నైతిక అర్హత లేనటువంటి విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. సొంత జిల్లా వనపర్తిలో భూ దందాలకు భూ కబ్జాలకు పాల్పడుతున్నటువంటి మంత్రి సొంత నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధిని పక్కన పెట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. ఈ మంత్రి సొంత నియోజకవర్గానికి సంబంధించిన ఏదుల శ్రీ ఆంజనేయ రిజర్వాయర్ లో భూములు కోల్పోయాం రైతులకు ముంపు బాధితులకు సరైన నష్టపరిహారం ఇవ్వకుండా బాధితులను తన చుట్టూ తిప్పుకుంటున్న అటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి మంత్రి నిరంజన్ రెడ్డి. ఈ వాస్తవాలు తెలుసుకోలేని వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి ఎట్లా అయ్యాడు ఇలాంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి కావడం నిజంగా దురదృష్టకరం గతం తెలియకుండా ఇలాంటి వాఖ్యలు మంత్రి నిరంజన్ రెడ్డి గారు చేసినందుకు తీవ్రంగా ఖండిస్తున్నట్లు జనసేన పార్టీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నాయకులు భైరపోగు సాంబశివుడు గారు ప్రకటనలో తెలిపారు. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తక్షణమే క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో వనపర్తి నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ కార్యకర్తలు జన సైనికులు తగిన బుద్ధి చెప్తారని వ్యాఖ్యానించారు.