అమలాపురం ( జనస్వరం ) : ఆక్వా రైతుఆక్రందన కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి ఆక్వారైతుల కష్టాల గురించి వినతిపత్రం ఇవ్వడానికి అమలాపురం గడియార స్తంభం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 1. ఆక్వా రైతులకు మద్దతుగా వారి డిమాండ్లు ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలి… 2. ప్రభుత్వమే కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటు చేయాలి. 3. గ్రేడింగ్ సక్రమంగా జరిగి పీస్ టు పీస్ ధర నిర్ణయించాలి. 4. ఆకాశన్నంటిన ఫీడ్ ధరలను తగ్గించాలి. వీటిని వెంటనే పరిష్కరించాలి అని జనసేన పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి వినతిపత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంతం నానాజీ గారు, శెట్టిబత్తుల రాజబాబు గారు, పితాని బాలకృష్ణ గారు, DMR శేఖర్ గారు, పోలిశెట్టి చంద్రశేఖర్ గారు, బండారు శ్రీనివాస్ గారు, మరెడ్డి శ్రీనివాస్ గారు, సంగీశెట్టి అశోక్, గొల్లప్రోలు మండల అధ్యక్షుడు అమరధి వల్లి రామకృష్ణ, పుణ్యమంతుల మూర్తి, దేశిరెడ్డి సతీష్, నామా సాయి బాబు,జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లా నాయకులు, వీరమహిళలు, జిల్లా నలుమూలల నుండి వచ్చిన కార్యకర్తలు, జన సైనికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజోలు నియోజక వర్గ జనసేన నాయకులు, రాష్ట్ర జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు,సర్పంచ్ లు ఎంపీటీసీ లు వార్డ్ మెంబర్లు, గ్రామ శాఖ అధ్యక్షులు జనసైనికులు వీర మహిళలు ఆక్వా రైతులు పాల్గొన్నారు