అనంతపురం, (జనస్వరం) : అనంతపురం జనసేనపార్టీ కార్యాలయంలో అర్బన్ ఇంచార్జ్ & జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ ఆధ్వర్యములో అర్బన్ బ్యాంక్స్ డైరెక్టర్ గా ఎన్నికైన రొళ్ళ భాస్కర్ కి సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా టిసి వరుణ్ మాట్లాడుతూ అనంతపురం అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా 1615 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన జనసేనపార్టీ నగర ప్రధాన కార్యదర్శి రొళ్ళ భాస్కర్ గారి విజయం ఎంతో ఉత్సాహాన్ని నింపిందని పేర్కొన్నారు. అనంతరం అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రోళ్ళ భాస్కర్ మాట్లాడుతూ తన విజయానికి సహకరించిన పేరుపేరునా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు, నగర్ కమిటీ సభ్యులు, నాయకులు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.