మదనపల్లి ( జనస్వరం ) : గత కొద్ది నెలలుగా మదనపల్లిని జిల్లా చేయాలని మదనపల్లి, పడమర నియోజకవర్గాల ప్రజలు కోరిక. నవంబర్ 30 న ముఖ్యమంత్రి జగన్ మదనపల్లి పర్యటనలో భాగంగా విచ్చేస్తున్న సందర్భంగా స్వాగతం పలుకుతూ ముఖ్యమంత్రి మదనపల్లి జిల్లా ఆకాంక్ష తెలియజేసేలా అందరూ ఇంటి పైన నల్ల జెండాల ప్రదర్శించాలని కోరారు. ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసినపటినుండి మదనపల్లిలో జిల్లా ఆకాంక్ష తెలియజేయడానికి 2019 నుండి మదనపల్లిలో మొట్ట మొదటిగా లక్ష సంతకాల సేకరణ అలాగే, లక్ష పోస్టు కార్డుల ఉద్యమం జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. తమ ఆకాంక్షను గౌరవించి జనగణమన రూపొందించిన మదనపల్లి ని “జనగణమన జిల్లా” గా ప్రకటించాలని “జనగణమన జిల్లా”గా మదనపల్లిని ప్రకటించి జాతీయ గీతని గౌరవించాలని సీఎం జగన్ రెడ్డికి జనసేన పార్టీ నాయకులు డా. మైఫోర్స్ మహేష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు అమర నారాయణ, మల్లిక, రూప, శోభ, నరేష్, ఆయాజ్, నాగేంద్ర, సోను, హర్ష తదితరులు పాల్గొననారు.