న్యూస్ ( జనస్వరం ) : JSP గ్లోబల్ టీం వ్యవస్థాపకులు సురేష్ వరికూటి, పద్మజ రామిశెట్టి అధ్యక్షతన వివిధ దేశాల ఎన్‌ఆర్‌ఐ జనసైనికులతో జూమ్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేనపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారు హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ వివిధ దేశాల జనసైనికులతో జూమ్ సమావేశం కావడం చాలా ఆనందంగా ఉన్నారు. అన్ని దేశాల జనసైనికులను ఒక తాటిమీదకు తీసుకురావడానికి కృషి చేస్తున్న JSP గ్లోబల్ టీమ్ సభ్యులకు కృతజ్ఞతలు చేశారు. ఇలా అన్ని దేశాల వారు ఐక్యమత్యంగా ఉండటం వల్ల జనసేనపార్టీ ఐక్యతను సూచిస్తుంది అన్నారు. ఆమె మాట్లాడుతూ మహిళలకు రాజకీయాల్లో జనసేన పార్టీ ప్రాధాన్యం ఇస్తుంది అని చెప్పడానికి నేనే గొప్ప ఉదాహరణ అని అన్నారు. ఒక సాధారణ మధ్యతరగతి గృహణిగా ఉన్న నేను నేడు జనసేనపార్టీ అధికార ప్రతినిధిగా ఉండడం అనేది పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు నిదర్శనం అన్నారు. కళ్యాణ్ గారు తరచూ చెబుతూ రబ్బరు చెప్పులు వేసుకున్న వారిని రాజకీయాల్లో ఉన్నత స్థానాన్ని నిలబెట్టడమే నిజమైన ప్రజాస్వామ్యం అంటారు. గతంలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ జనసేనపార్టీలో 33% రాజకీయ అవకాశాలను కల్పించడం చూసామన్నారు. సాధారణ ప్రజల్లో టీడీపీ, జనసేన రెండూ ఒకటే అనే భావనను వైసీపీ ప్రభుత్వం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. సామాన్య ప్రజలకు అర్థం అయ్యేలా జనసేనపార్టీ ఎవరి పల్లకీలు మోయడానికి లేదు సామన్య ప్రజానీకాన్ని గెలిపించడానికి జనసేనపార్టీ సింహాసనం అధిరోహిస్తుందని తెలియజేయగలగాలి. పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రజల్లోకి తీసుకెళ్లడం మన అందరి మీద ఉన్న బాధ్యత అన్నారు. చాలా నియోజకవర్గాలలో ఇంచార్జ్ లు లేరన్నది వాస్తవమే. కానీ దానికి విభిన్న కారణాలు లేకపోలేదని చెప్పారు. గతంలో ఇంఛార్జ్ లు చివరి నిమిషంలో ఇతర పార్టీలోకి జంప్ అవడం, సమస్యల మీద బలంగా పోరాడుతున్న నాయకుల మీద ప్రభుత్వ ఒత్తిళ్లు, ఇలా చాలా కారణాలు ఉన్నాయన్నారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ గారి బస్సు యాత్ర ఉంటుందని, ఆలోపే అన్ని నియోజకవర్గాలకు ఇంఛార్జ్ లు, కమిటీలు పూర్తి చేసే ఆలోచన పార్టీ పెద్దలలో ఉందని తెలియజేసారు. ఏ పార్టీకి లేనంతగా మనకి సోషల్ మీడియా వ్యవస్థ ఉంది. కానీ ఒకే తాటిమీదకు జనసైనికులను, వీరమహిళలను తీసుకురాగలిగితే మరింత జనసేన సోషల్ మీడియా బలోపేతం చేసే అవకాశం ఉంది. పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లానన్నారు. త్వరలోనే సోషల్ మీడియా కమీటీలు వేస్తామని భరోసా ఇచ్చారన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ ఖజనాను ఉపయోగించి టీమ్ జగనన్న అనే సోషల్ మీడియా వ్యవస్థను నడుపుతున్నారు. జగన్ తన వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నాడనేది జగమెరిగిన సత్యం. వాటిని తిప్పి కొట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కళ్యాణ్ గారు రాత్రికి రాత్రి సీఎం అవ్వాలని పదవి ఆకాంక్ష లేదని, వ్యవస్థ నాశనం అవుతోందని బాగుచేయాలంటే ప్రక్షాళన కోసం సీఎం అవ్వాలని కోరుకున్నారు. నాసేన కోసం నావంతు కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఎన్నారై జనసైనికులు, వీరమహిళలు విజయవంతం చేయాలని కోరారు. వివిధ నియోజకవర్గ ఎన్‌ఆర్‌ఐ జనసైనికులు తమ సందేహాలను రాయపాటి అరుణ గారిని అడగ్గా వారికి ఓపికతో సమాధానాలు ఇచ్చారు. అలాగే వారి నుండి సూచనలు, సలహాలు తీసుకొని వాటిని అమలుపరిచేలా కృషి చేస్తానన్నారు.
ఈ జూమ్ సమావేశంలో ఈ కింది ఎన్నారై జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.
1.Suresh Varikuti – Germany
2. Naga Komminedi-Sydney
3.Indraneel MUppidi Dubai,UAE
4.Himavalli Chalikonda-London,UK
5 Kalyan Chakravarty Mitta – London ,UK
6. Kalyani Patthi – USA
7. Prasad Chodasani – Singapore
8.HEMA LATHA GADIREDDI, BRISBANE
1.Suresh Varikuti – Germany
2. Naga Komminedi-Sydney
3.Indraneel MUppidi Dubai,UAE
4.Himavalli Chalikonda-London,UK
5 Kalyan Chakravarty Mitta – London ,UK
6. Kalyani Patthi – USA
7. Prasad Chodasani – Singapore
8.HEMA LATHA GADIREDDI, BRISBANE AUSTRALIA
9. Bala Subramanyam Nalli – UK
10. Sairam Thota – New Zealand
11. Joji gubili – London UK
12. Charan Damisetti – Melbourne
13. Chandra Kondepudi -London UK
14. Naga Vamsi Krishna Thirumalasetty- South Korea
15. Raja Thammisetty – Sweden
16. Padmaja Ramisetti – London UK
17. Pavan Kumar Marri – Singapore
18. Sriharsha Vasa – Sweden
19. Dr. Naveen Kumar – South Korea
20. Praveen Jagurumilli – Belgium
21. Amala Chalamalasetty
22. Chaandu – Germany & others…