నూజివీడు ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు నూజివీడు నుండి ఏలూరుకి వెళ్ళే రహదారి గుంతలు గుంతలుగా ఏర్పడి ప్రయాణికులకు ఇబ్బందులు, ప్రమాదాలు గురికావడం జరుగుతున్నాయి అని జనసేన పార్టీ నూజివీడు నియోజకవర్గ నాయకులు పాశం నాగబాబు నూజివీడు-ఏలూరు ప్రధాన రహదారిలో గల ముసునూరు-ఏలూరు వెళ్ళే గోపవరం రోడ్డు జంక్షన్ వద్ద కార్యకర్తలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో రహదారులు మృత్యు ద్వారాలను తలపిస్తున్నాయని నూతన జిల్లాలు ఏర్పాటు చేయడం కాదు రోడ్లు నిర్మాణం కూడా చేయాలని అలానే జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాటుకు స్థలం ఇచ్చారనే కక్షతో రోడ్లు విస్తరణ పేరుతో వైసిపి ప్రభుత్వం ఇప్పటం గ్రామంలోని ఇళ్లను కూల్చివేయడం కాదు ఇలాంటి ప్రాణాలకు భద్రత లేని రోడ్లు రాష్ట్రంలో చాలా ఉన్నాయి ముందు వాటిని బాగుచేయలని,అలానే నూజివీడు ఎమ్మెల్యే గారు కనీసం నోరు తెరిచి ఏలూరు జిల్లా ప్రధాన కేంద్రంకి వెళ్ళే రోడ్లు అంతా గుంతలమయం కావడంతో ప్రజలు రోడ్డు ప్రయాణం చేయడానికి భయాందళన చెందుతున్నారన్నారు. ప్రభుత్వము తక్షణమే స్పందించి నూతన రహదారులు విస్తరణ చేసి ప్రజలకు ప్రాణాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో నిరసనలు మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు బొట్ల నాగేంద్ర, చేబత్తిన విజయ్, వేట త్రినాథ్ ,గోపీకృష్ణ , గోవర్ధన్, సిహెచ్ సోమరాజు, అనీల్ తదితరుల పాల్గొన్నారు.