
న్యూస్ ( జనస్వరం ) : JSP గ్లోబల్ టీం వ్యవస్థాపకులు సురేష్ వరికూటి అధ్యక్షతన వివిధ దేశాల ఎన్‌ఆర్‌ఐ జనసైనికులతో జూమ్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేనపార్టీ నాసేన కోసం నావంతు కో- కన్వీనర్ రుక్మిణి కోట గారు హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ వివిధ దేశాల జనసైనికులతో జూమ్ సమావేశం కావడం చాలా ఆనందంగా ఉన్నారు. అన్ని దేశాల జనసైనికులను ఒక తాటిమీదకు తీసుకురావడానికి కృషి చేస్తున్న JSP గ్లోబల్ టీమ్ సభ్యులకు కృతజ్ఞతలు చేశారు. ఇలా అన్ని దేశాల వారు ఐక్యమత్యంగా ఉండటం వల్ల జనసేనపార్టీ ఐక్యతను సూచిస్తుంది అన్నారు. ఆమె మాట్లాడుతూ నా సేన కోసం నా వంతు అనే కార్యక్రమం నిరంతరం జరిగే ప్రక్రియ అని సూచించారు. గతంలో మన దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు క్రౌడ్ ఫండింగ్ ద్వారా పార్టీలను నడిపించి తద్వారా ప్రభుత్వాలను స్థాపించి ప్రజలకు స్వచ్ఛమైన ప్రజాపాలనను అందించిన దాఖలాలు చూసాము. క్రౌడ్ ఫండింగ్ అనేది స్వాతంత్ర్య సమరోద్యమంలో ప్రముఖ పాత్ర వహించింది. ఇపుడు జనసేనపార్టీ ద్వారా “నా సేన కోసం నా వంతు” అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా పార్టీ మీద నమ్మకాన్ని కలిగించవచ్చు. ఇప్పటికే ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. సామాన్యుడు రూ. 10 నుంచి పార్టీకి విరాళం అందించడం ద్వారా వాళ్ళకి పార్టీ మీద ఉన్న నమ్మకం, భరోసాని కలిగిస్తుందన్నారు. మనం ఈ కార్యక్రమాన్ని క్రౌడ్ ఫండింగ్ లాగా కాకుండా క్రౌడ్ పూలింగ్ లాగా చేయాలని నినాదంతో ముందుకు వెళదామన్నారు. ఇలా చేయడం వల్ల పార్టీ సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లినట్లు ఉంటుందన్నారు. క్రౌడ్ పూలింగ్ ద్వారా కోటి మందిని పార్టీకి అనుసంధానం చేసేలా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. NRI జనసైనికులు కనీసం రూ. 1000 నా సేన కోసం నా వంతుకి అందించవచ్చు అన్నారు. విదేశాల్లో ఉంటూ పార్టీ కోసం అండగా ఉంటున్న ప్రతి ఒక్క జనసైనికునికి, వీరమహిళలకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే NRI కమిటీలు ఏర్పాటు చేయడానికి పార్టీ దృష్టికి తీసుకెళ్తామని రుక్మిణి గారు చెప్పారు. వివిధ నియోజకవర్గ ఎన్‌ఆర్‌ఐ జనసైనికులు తమ సందేహాలను రుక్మిణి కోట గారిని అడగ్గా వారికి ఓపికతో సమాధానాలు ఇచ్చారు. అలాగే వారి నుండి సూచనలు, సలహాలు తీసుకొని వాటిని అమలుపరిచేలా కృషి చేస్తానన్నారు.