ఆళ్లగడ్డ, (జనస్వరం) : ఆళ్ళగడ్డ జనసేన పార్టీ కార్యాలయంలో ఆళ్ళగడ్డ జనసేన నాయకులు మైలేరి మల్లయ్య మీడియాతో మాట్లాడుతూ నిన్న సిరివెళ్ల పసుల పేటలో జరిగిన సంఘటనను, జనసేన నాయకులు సిరివెళ్లలో అభివృద్ధి అడ్డుపడుతున్నారని అలజడి సృష్టిస్తున్నారని వైసీపీ నాయకుల మాటలను తీవ్రంగా ఖండించారు. సిరివెళ్లలో పసులో పేటలో జెసిబితో డ్రైనేజీ కాలువ మరమ్మతులు చేస్తున్న వైసీపీ ఎంపీపీ వసీం నాయక్, వైసీపీ పార్టీకి చెందిన పసుల పుల్లయ్య కుమారులు దీవన్న , ప్రవీణ్ కుమార్ వారి మధ్య జరిగిన గొడవలను సిరివెళ్ల మండల జనసేన నాయకులు మీద నిందించడానికి తీవ్రంగా ఖండించారు. సిరివెళ్ల ఎంపీపీ వసీం నాయక్ చేసిన దాడిలో గాయపడిన పశువుల దీవెన ప్రవీణ్ కుమార్ లను మానవత్వంతో పరామర్శించడానికి వెళ్లిన జనసేన నాయకులు పసుల నరేంద్ర యాదవ్ వెళ్లారని అక్రమంగా, అన్యాయంగా జనసేన నాయకుల మీద పార్టీ మీద నిందించడానికి తీవ్రంగా ఖండించారు. వైసీపీ ఎంపీపీ మీద దాడి జరిగిందని ఆళ్ళగడ్డ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఎమ్మెల్సీ సర్టిఫికేట్ డాక్టర్లను కోరగా గాయాలు లేకున్నా ఎమ్మెల్సీ సర్టిఫికెట్ ఇవ్వలేమని డాక్టర్లు చెప్పడం నిజం కాదా? ఎంపీపీ దాడి చేసిన కుటుంబ సభ్యులను భయపెట్టి రివర్స్ కేసు పెడతాము మీ అబ్బాయి ఉద్యోగం పోతుంది కనుక మీరు ఎలాంటి కేసు నమోదు చేయవద్దని మాట్లాడింది నిజం కాదా? గతంలో సిరివెళ్లలోనే ఇసుక ట్రాక్టర్ ఆపారు అని వైసీపీ నాయకులు ఏకతాటిక తన అనుచరులతో ఆశా జిరాక్స్ అనే షాపుపై జిరాక్స్ మిషన్లు కంప్యూటర్లు సంబంధిత వస్తువులను ధ్వంసం చేయడం వాస్తవం కాదా? అదే షాప్ కు సంబంధించిన వారి ఇంటిలోని సామాగ్రిని మైనార్టీ మహిళలు ఉన్నారని కూడా చూడకుండా ఇంటిలోకి జరబడి ఇంటి వస్తువులను ధ్వంసం చేరడం చేయడం నిజం కాదా? పని ప్రశ్నించారు. మీరు చేసే మేడిపండు( మేడిపండు చూడు మేలిమైనుండు పొట్ట విప్పి చూడు చూడు పురుగులు ఉండు) ఇలాంటి పనులు సిరివెళ్ల గ్రామ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, ఎన్ని రోజులు నిజాలను అబద్ధాలు చేస్తూ, అబద్ధాలు నిజాలు చేసుకుంటూ వెళ్తారో అని సిరివెళ్ల ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, సిరివెళ్లలో వైసీపీ నాయకులను ప్రజలు ఎన్నుకున్నది ప్రజా సమస్యలు తీర్చడానికి, అభివృద్ధి చేయడానికని , మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల మీద దాడి చేయడానికి కాదని, రౌడీలు, గుండాల్లాగా ప్రవర్తిస్తున్నది అధికార మదంతో పోలీసు వ్యవస్థను చేతిలోకి తీసుకొని జనసేన నాయకుల మీద దాడులు చేస్తాం, అక్రమంగా కేసులు పెడతామని బెదిరిస్తే భయపడటానికి ఎవరు లేరని, వైసిపి నాయకులు ఎన్ని బెదిరింపులు చేసినా, జనసేన నాయకులు మీద దాడి చేసిన ప్రజా సమస్యల మీద ప్రజల తరఫున పోరాడతామని తెలియజేశారు. జనసేన నాయకులు అభివృద్ధిని కోరుకునే వ్యక్తులే తప్ప అడ్డుపడే వాళ్ళం కాదని వైసీపీ నాయకుల అభివృద్ధి చేయలేక జనసేన నాయకుల నాయకులను నిందించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పసుల నరేంద్ర యాదవ్, రాచంశెట్టి వెంకటసుబ్బయ్య, బావికాడి గుర్రప్ప, నయమత్ ఖాన్, సజ్జల నాగేంద్ర, దూలం చైతన్య పాల్గొన్నారు.