ఆమదాలవలస, (జనస్వరం) : ఆమదాలవలస నియోజకవర్గ మొదటి వార్డు (బైరి శాస్త్రుల పేట)లో ఇటీవలే బండారి మంజు అనే దళిత మహిళపైన భూ తగదాలో పక్క గ్రామం అయిన గాజుల కొల్లివలస సర్పంచ్ ముంజేటి కూర్మరావు అనే వ్యక్తి, కొంతమంది వ్యక్తులు పెద్దమనిషి తరహలో వచ్చి ఆమెపై దాడి చేశారు. ఈ విషయంపై శ్రీకాకుళం జిల్లా డీఎస్పీ కూడా కేసు కట్టి దర్యాప్తు కూడా చేసారు. అయితే బండారి మంజు అనే మహిళ ఇంటర్ కాస్ట్ వివాహం వలన ఆమెకు కాస్ట్ సర్టిఫికెట్ కొత్తది ఇవ్వనివ్వకుండా రాజకీయ కుట్ర చేస్తున్నారు. దీనిపై దళితలకు అండగా జనసేనపార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది అని భరోసాతో ఆమదాలవలస నియోజకవర్గం జనసేన ఎంపిటిసి విక్రమ్ దళిత సంఘాలతో మద్దతు పలికారు. అలాగే జనసేనపార్టీ తరుపున కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటాము అని భరోసా ఇచ్చారు. అలానే cast (కులదృవీకరణ పత్రం) సర్టిఫికేట్ వెంటనే ఇవ్వాలి అని వెంటనే mro(తహశీల్దార్)కి వినతి పత్రం అందించారు. అతను సానుకూలంగా స్పందించి రేపటిలోగా ఇస్తాం అన్నారు. అంతేకాక ఎంపీటీసీ విక్రమ్ తక్షణమే నిందితులని ఎక్కడున్నా అరెస్ట్ చేసి తగిన శిక్ష వేయాలని పోలీస్ అధికారులను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కసింవలస రాంబాబు, నాయకులు, అలానే దళిత సోదరులు, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.