– వెలగలేరు లేఔట్ జగనన్న స్మశాన వాటిక లాగా ఉంది
– ఫౌండేషన్ నమూనా చూస్తే శవపేటికలు లాగా కనపడుతున్నాయి
– రెండు అడుగుల ఎత్తు కట్టిన గోడలు ఆదివారం పూట చేపల వ్యాపారం చేసుకునే తొట్టెల్లాగా కనబడుతున్నాయి
– 2083 ఇళ్లకు ఒక్క ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయలేని వెల్లంపల్లి శ్రీనివాస్ ఏ స్థాయి అసమర్ధుడు ?
విజయవాడ, (జనస్వరం) : జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు 2వ రోజు కార్యక్రమంలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వాసులకు కేటాయించిన వెలగలేరు మరియు మునగపాడు లేఅవుట్ లను మైలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ అక్కల గాంధీతో కలిసి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్, నగర అధ్యక్షులు & రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ మరియు అక్కల గాంధీలు మాట్లాడుతూ
1) 240 ఎకరాల మునగపాడు లేఅవుట్ విజయవాడ నగరవాసులకు కేటాయించారని ఈ లేఅవుట్ విజయవాడ నగరానికి 45 కిలోమీటర్ల దూరాన 4 బస్సులు మారి 4 రైల్వే ట్రాక్ల దాటిన తర్వాత కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, మధ్య ఉన్న బీడు భూమి కేటాయించారని రాబోయే 100 ఎళ్ళు కూడా ఇక్కడ ఇళ్ల నిర్మాణం చేపట్టడం అసాధ్యమని అటువంటి అడవి ప్రాంతాల్లో జగనన్న కాలనీలో పేరుతో ప్రజలను పచ్చి మోసం చేస్తున్నారని ఈ లేఔట్ కేవలం విజయవాడ నగరంలోని వెల్లంపల్లి శ్రీనివాస్ మల్లాది విష్ణు దేవినేని అవినాష్, వసంత కృష్ణ ప్రసాదులకు కోట్ల రూపాయలు సంపాదించే ఆదాయ వనరు మాత్రమేనన్నారు. రహదారి లేని ప్రాంతాల్లో లేఔట్లు ఇవ్వడం ఏమిటన్నారు 10 నుంచి 12 లక్షల రూపాయలు పలికే ఈ ప్రాంతంలో ఎకరం ధరను 30 లక్షల పైచిలుకు కొన్నారంటే ఇందులో 50 కోట్లకు పైగా ఈ ఎమ్మెల్యేలందరూ కలిసి దండుకున్నారనీ ఇది కేవలం ప్రజలను మోసం చేసి నాయకులు బకాసురులా మింగేందుకే ఈ పథకం అన్నారు.
2) వెలగలేరు లేఅవుట్ పోలవరం బుడమేరు ముంపునకు గురయ్యే ప్రాంతంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వాసులకు వెలగలేరు పోలవరం కాలువ ఎడమ చేతి వైపున ప్రధాన రహదారికి మూడు కిలోమీటర్ల లోపల సెంటు భూమిలో 2083 మంది పేదలకు ఇళ్ల నిర్మాణం పేరుతో దగా చేస్తున్నారన్నారని, పశ్చిమ నియోజకవర్గం సర్కిల్ వన్ లో 2083ఇళ్లకు ఒక్క ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయలేని వెల్లంపల్లి శ్రీనివాస్ ఏ స్థాయి అసమర్ధుడో ఈ ఒక్క లేఔట్ చూస్తే అర్థమవుతుందని, ఒక్క ఇంటి కూడా ఫౌండేషన్ పూర్తి కాలేదని , ఈ లేఔట్ జగనన్న స్మశాన వాటిక లాగా ఉందని, ఫౌండేషన్ నమూనా చూస్తే శవపేటికలు లాగా కనపడుతున్నాయని, రెండు అడుగుల ఎత్తు కట్టిన గోడలు ఆదివారం పూట చేపల వ్యాపారం చేసుకునే తొట్టెల్లాగా కనబడుతున్నాయని, ఇవి ఇళ్ళు లాగా కనపడటం లేదని, పేద సామాన్య ప్రజలను సొంత ఇంటి కల పేరుతో మోసం చేస్తూ చాలీచాలని డబ్బులు ఇస్తూ వారి జీవితాలను సర్వనాశనం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రెడ్డిపల్లి గంగాధర్, రాము గుప్తా, షేక్ అమీర్ భాష, వేంపల్లి గౌరీ శంకర్,జల్లి రమేష్, పొట్నూరి శ్రీనివాసరావు , కూరగంజి వెంకటరమణఏలూరి సాయి శరత్, బోమ్ము రాంబాబు, ప్రతినిధి స్టాలిన్ శంకర్, వెన్న శివశంకర్, మొబీనా, గన్ను శంకర్, బోట్ట సాయి, రాళ్లపూడి గోవింద్, కేఎస్ఎన్ మూర్తి, ధారా రాము, ఎన్నమనేని కృష్ణ, బావిశెట్టి శ్రీను, దాసిన జగదీష్, పవన్ కళ్యాణ్, రాజా నాయుడు, పండు, రామానాయుడు తదితరులు పాల్గొన్నారు.