రాజంపేట, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జగనన్న కాలనీలో మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య విమర్శించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు రాజంపేట జనసేనపార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు జగనన్న ఇళ్లు – పేదలకు కన్నీళ్లు’ మూడవరోజులో భాగంగా సోమవారం రాజంపేట మండలం ఊటుకూరు పంచాయతీలోని సున్నపురాళ్లపల్లె గుట్ట గ్రామ వాసులకు కొండలు, గుట్టల మధ్య పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రాటాల రామయ్య మాట్లాడుతూ పేదలకు రూ.5లక్షలతో స్వయంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని ఆర్భాటంగా చెప్పిన సీఎం జగన్ ఎన్ని ఇళ్లు ఎన్ని జగనన్న కాలనీలు నిర్మించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జగనన్న కాలనీల కారణంగా పేదలు రాష్ట్రవ్యాప్తంగా అప్పులు పాలయ్యారని ధ్వజమెత్తారు. ఇళ్లు లేని నిరుపేదలు వైసీపీ దళారులకు ముడుపులు చెల్లించుకుని ఇటు జగనన్న ఇల్లు లేకుండా సొంత గూడుకు నోచుకొని దురవస్థలో పేదలు కొట్టుమిట్టాడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.