ఆచంట ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఆచంట నియోజకవర్గం వల్లూరు గ్రామంలో గ్రామ జనసేనపార్టీ అధ్యక్షులు కడిమి ఉమామహేశ్వరస్వామి ఆధ్వర్యంలో జగన్ రెడ్డి గారు పేదలకు ఇచ్చిన ఇల్లాస్థలాలు పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ ఉమ్మడి పగోజిల్లా సెక్రెటరీ చిట్టూరి శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ రోజు ఆచంట నియోజకవర్గం వల్లూరు గ్రామంలో పేదలకు జగన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ల స్థలాలను పరిశీలించండి జరిగిందని కానీ ప్రభుత్వం ఇల్లాస్థలాలు కేటాయించిన చోట కనీస మౌలిక సదుపాయాలు ఐనటువంటి రోడ్లు, డ్రైనేజి, వాటర్, కరెంటు వంటివి ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, సరైన రహదారులు లేకపోవడం వలన లబ్ది దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కనీసం ఇసుక, సిమెంట్, కంకర ఐరన్ వంటివి రవాణా కు తీవ్ర ఇబందులు పడుతున్నారని, కావున ప్రభుత్వం వెంటనే స్పందించి రోడ్లు, డ్రైనేజీ, కరెంట్, వాటర్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేసారు, జనసేనపార్టీ ఉమ్మడి పగో జిల్లా జాయింట్ సెక్రెటరీ రావి హరీష్ మాట్లాడుతూ జగన్ రెడ్డిగారు ఇచ్చిన కాలనీల్లో సరైన మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం వలన లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోతున్నారని, లబ్ధిదారులు అప్పులు తెచ్చుకుని బెస్మెంట్లు వేసుకున్నారని కానీ ఇక్కడకు కనీసం ఇసుక కంకర ఐరన్ తెచ్చుకుని ఇల్లు నిర్ముంచుకొనే అవకాశం లేకపోవడం వలన, తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరుగపోయి, ఇల్లు నిర్ముచుకోలేక తీవ్ర ఇబందులు పడుతున్నారని, కావున ప్రభుత్వం వెంటనే స్పందించి లబ్ధిదారులు కు ప్రభుత్వం అందిచవలసిన సిమెంట్, కంకర, ఐరన్, ఇసుకు, వారికి రావలసిన లోను వెంటనే విడుదలచేసి, వారు ఇల్లు నిర్మిచుకోవడానికి అవసరమైన మౌలికసదుపాయాలు వెంటనే ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేసారు.