పత్తికొండ ( జనస్వరం ) : పత్తికొండ టౌన్ కు సంబంధించిన ఆదోని రోడ్డులో ప్రభుత్వము ఏర్పాటు చేసిన జగనన్న కాలనీని పరిశీలించి అక్కడ పరిస్థితులను తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ పూర్తిగా వాగు ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. మరి ముఖ్యంగా ఉరుకుంద ఈరన్న గుడి ముందర ఉన్న ప్లాట్లలో చేత వాటం ప్రదర్శించి డబ్బులు తీసుకున్నారని తెలియజేశారు, ఒక ప్లాట్ 30 వేల నుంచి 3 లక్షల వరకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. జగనన్న కాలనీలో అనేకచోట్ల బేస్ మట్టాలు చీలిపోయిన దృశ్యాలు చూసాం, ఇక్కడ స్థానికులను అడగ్గా ఇక్కడ మాకు కనీసం మౌలిక సదుపాయాలైన విద్యుత్, నీరు, రవాణా సౌకర్యం కూడా ఇక్కడ లేవన్నారు. లక్షా 80 వేల రూపాయలతో ఇల్లు నిర్మించుకోవడం మాకు సాధ్యం కాదని మాకు బేస్ మట్టంకే లక్ష రూపాయలు పైగా ఖర్చు అవుతుందని, ఇల్లు ఎప్పుడు నిర్మించాలని తెలియజేశారు. ఒక ఇల్లు నిర్మించడానికి మినిమం 5,00,000 అవుతుందని ప్రభుత్వం 1,80,000 రూపాయలు ఇస్తే మేము ఏ విధంగా ఇల్లు నిర్మించుకుంటామని తెలిపారు. ఇంకా అనేక చోట్ల ఇల్లు నిర్మాణాలు కూడా చేపట్టలేదు ఎందుకు చేపట్టలేదు అని అడగగా ఇక్కడ వాగు ప్రాంతం ఈ ప్రాంతంలో ఇల్లు నిర్మించుకోవడం అంటే మా ప్రాణాలను మేము తెగించుకున్నట్లు అవుతుంది. ఎందుకంటే ఇక్కడ బంక మట్టి ఉన్నందువల్ల బేస్ మట్టం పది అడుగులు పైగా తీయాలి. లేదంటే ఇల్లు కూలిపోయే అవకాశం ఉన్నందువల్ల నిర్మించుకోలేకపోతున్నారు అని తెలియజేశారు. పది అడుగులు తీసి ఇల్లు నిర్మించుకుంటే బేస్ మట్టానికి రెండు లక్షల పైగా ఖర్చు అవుతుందని తెలిపారు. మీరు అధైర్యపడకండి మీకు జనసేన పార్టీ అండగా ఉండి మీకు న్యాయం జరిగే విధంగా మేము పోరాడతామని లబ్ధిదారులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఐటి వింగ్ కోఆర్డినేటర్ పురుషోత్తం, జనసేన పార్టీ నాయకులు, ధర్మతేజ, చాంద్, భాష, వడ్డే విరేష్, ఎర్రి స్వామి, జీవన్ కుమార్ మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.