నెల్లూరు ( జనస్వరం ) : చేతికి వచ్చిన పంటను గ్రేడ్ చేసి మొదటి శ్రేణి బయట రాష్ట్రాలకు ఇతర దేశాలకు తరలిస్తున్నట్టు ఎంతో మేధో శక్తి గల అగ్ర వర్ణాల పిల్లలు తమ ప్రతిభకు తగ్గ అవకాశాలు రావడం లేదని ఇతర రాష్ట్రాలకు దేశాలకు తరలిపోవడం జరుగుతున్నదని నెల్లూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ అన్నారు. అగ్రవర్ణాలకు వెనుకబడిన వారికి అందే విధంగా ఈ డబ్ల్యూ ఎస్ ఇవ్వడం 10% ఇవ్వడం అనేది శుభపరిణామమే అని అన్నారు. జనసేన పార్టీ మొదటి నుంచి చెప్తుంది కులమతాలకు అతీతంగా ఉచిత విద్య వైద్య విధానాలను ప్రవేశపెడతామని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు ఆ రోజున ఉన్న ఆర్థిక పరిస్థితులు వెనుకబడిన వర్ణాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని సంవత్సరాలు మాత్రమే అందుబాటులో ఉండేటట్లు భారత రాజ్యాంగ రూపొందించబడింది.. కానీ ఇప్పటికీ అదే విధంగా కొనసాగుతుంది దానిని సమీకరించాల్సిన పరిస్థితి ఉంది. అగ్రవర్ణాలకు చెందిన వారు ఎందరో విద్యా, ఉద్యోగాలు అనేక ఇబ్బందులకు గురై ఇతర దేశాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి. అందునా 50% ఉన్న ఓసీల్లో దాదాపుగా 25% పైబడిన కాపులకు జగన్ రెడ్డి గారు కాపులకు ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వక వారిని మోసం చేశారు. రాష్ట్రంలో కాపులకు ఐదు పర్సెంట్ కూడా వర్తించపర్తింపజేసేటట్లు చూడాలని కోరుతున్నానని కోరారు.