Search
Close this search box.
Search
Close this search box.

గాదె వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పలువురు మహిళలు జనసేన పార్టీలోకి చేరిక

      గుంటూరు, (జనస్వరం) : గుంటూరు జిల్లా జనసేనపార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు  సమక్షంలో 21 వార్డు నుంచి వీర మహిళలు తన్నీరు రాజ్యలక్ష్మి, రొక్కం ఝాన్సీ ఆధ్వర్యంలో వీర మహిళలు జనసైనికులు నూతనంగా పార్టీలోకి చేరడం జరిగింది. వీరి అందరికీ స్వాగతం పలుకుతూ మెడలో కండువాలు వేసి పార్టీలోకి గాదె వెంకటేశ్వరరావు ఆహ్వానించారు. ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ జనసేన పార్టీ రోజు రోజుకీ ప్రజల ఆదరణ పొందుతుంది అనడానికి ఇదే ఒక నిదర్శనం. మా వీర మహిళలు తన్నీరు రాజ్యలక్ష్మి, రొక్కం ఝాన్సీ ఆధ్వర్యంలో 30 మంది మహిళలు 10 మంది జనసైనికులు పార్టీలోకి చేరడం జరిగింది. వీరి అందరికి స్వాగతం పలుకుతూ వారి మెడలో కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఇలాంటి శుభ పరిణామం జరగటం మాకు గాని కార్యకర్తకలకు గాని ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మా వీర మహిళలు జనసేన పార్టీకి వెన్నుముకలా నిలిచి పార్టీని ముందుకు నడిపించడంలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు దానికి చాలా గర్వపడుతున్నాను. అలాగే మీరు భవిషత్ లో ప్రతి పార్టీ కార్యక్రమంలో ముందుండి నడిపించాలని వీర మహిళలను కోరడం జరిగింది. భవిష్యత్తు రాజకీయం మొత్తం మా వీర మహిళల చేతిలో ఉంది అని చెప్పటానికి చాలా గర్వపడుతున్నాను. అలాగే రానున్న రోజుల్లో మన పార్టీ రోడ్లపైకి వచ్చి అధికార ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ఎండగట్టే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనం అందరం కలిసికట్టుగా వాటిని ఎదుర్కొనే విధంగా ప్రణాళికని ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా మాణిక్యాల రావు, నారదాసు రామచంద్ర ప్రసాద్, నెల్లూరు రాజేష్, శ్రీపతి భూషయ్య, దాసరి వెంకటేశ్వరరావు, మధులాల్, SK.జమిర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20240413-WA0018
తెనాలిలో జరుగనున్న పవన్ కళ్యాణ్ బహిరంగ సభను విజయవంతం చేయాలి :
IMG-20240322-WA0009
నల్లాని రాజేశ్వరి నిర్మించిన పాటల సిడిని ఆవిష్కరించిన నారా లోకేష్
IMG-20240312-WA0004
వైసీపీ పతనానికి కౌంట్ డౌన్ మొదలైంది
IMG-20240227-WA0007
ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?
IMG-20240224-WA0189
జగణాసుర పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకొందాం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way