రాయదుర్గం, (జనస్వరం) : అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్ మండలంలోని దర్గా హొన్నూర్ విద్యుత్ వైర్లు పడి నలుగురు కూలీలు మృతి చెందిన వారి కుటుంబాలను జనసేనపార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలకం మధుసూధన్ రెడ్డి, అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య పరామర్శించారు. అలాగే హృదయ విచారణ ఈ ఘటనపై ఆరా తీసి మృతుల, గాయపడిన కూలీల వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఒక్కక్కరికి 25లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, పక్కా ఇల్లు కట్టించాలని, భూమి లేని వారికి 2ఏకరాల భూమి ఇవ్వాలని ప్రభుత్వానికి జనసేనపార్టీ తరపున డిమాండ్ చేయడం జరిగింది. అదే సమయంలో అటుగా వచ్చిన స్థానిక ఎమ్మెల్యేతో బాధితులను ఆదుకోవాలని కోరగా నిర్లక్ష్యపు సమాధానంగా మీరు మాకు చెప్పకూడదు, మీకు హక్కు లేదు అని చెప్పడంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూధన్ రెడ్డి ఎమ్మెల్యేని ప్రజల సమక్షంలో నిలదీయడం జరిగింది. బాధితులకు న్యాయం జరిగే రకంగా తక్షణమే 25 లక్షల రూపాయలు, వారికి పక్కా ఇల్లు కట్టించాలని నిలదీయడం జరిగింది. ప్రతిపక్షాలకు బాధితుల పక్షాన మాట్లాడే హక్కు ఉంటుందని, వారి పక్షాన పోరాటం హక్కు ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి గౌతమ్, జిల్లా సంయుక్త కార్యదర్శి అవుకు విజయ్ కుమార్, మూప్పూరి క్రిష్ణ, మారేష్, బొమ్మనహల్ మండల అధ్యక్షులు శివ రాజ్, మండల అధ్యక్షులు గోపాల్, కేశవ్, రంజిత్, మధు, నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.