కార్వేటి నగరం ( జనస్వరం ) : మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షులు శోభన్ బాబు నియోజకవర్గ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో నియోజకవర్గ ఇన్చార్జ్ యుగంధర్ మాట్లాడారు. ప్రజా సమస్యల మీద ఈ మూడున్నర సంవత్సర కాలంలో ఎన్నో ప్రజా పోరాటాలు చేశామని, నియోజకవర్గంలో ఎక్కడ ప్రజా సమస్యలు ఉంటే, ఎక్కడ ప్రజల ఆర్తనాదాలు వినిపిస్తాయో, ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడుతుంటారో అక్కడికి వెళ్లి తన పరిధిలో సహాయ సహకారాలు అందించామన్నారు. మండల నాయకులు మాట్లాడుతూ మా నాయకుడి మీద కేసులు పెట్టడం అక్రమంగా అరెస్టు చేయాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమే దీనిని పూర్తిగా ఖండిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కల్యాణ్ కి, మా ఇంచార్జ్ యుగంధర్ పొన్నకి, నియోజకవర్గ జనసేన నాయకులకు పోలీసులు అంటే చాలా గౌరవం మని తెలిపారు. పోలీసులకు కూడా మేము చెప్పటం ఏమిటంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో ఉన్నత భాగం పోలీసులది, మీకు ఏదైనా అధికార పార్టీ నుంచి ఒత్తిడి ఉంటే మీరు వారికి సర్ది చెప్పాలి, ఇలాంటి అప్రజాస్వామికమైన వాటికి సహకరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అని తెలియజేశారు. ఇలాంటి అప్రజాస్వామికమైన వాటిని జనసేన పార్టీ ఎప్పుడు వ్యతిరేకిస్తుంది మా రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో ప్రజాస్వామ్యబద్ధంగా నడిచే జన సైనికులమైన మేము ఇలాంటి అక్రమ కేసులను పెట్టడాన్ని ఖండిస్తున్నాము. ఈ కార్యక్రమంలో వెదురుకుప్ప మండల అధ్యక్షులు పురుషోత్తం, పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్, కార్వేటినగరం టౌన్ ప్రెసిడెంట్ రాజేష్, ప్రధాన కార్యదర్శులు కావలి సతీష్, చంద్రమౌళి, కార్యదర్శులు సూర్య నరసింహులు, మణికంఠ, చిరంజీవి, జిల్లా సంయుక్త కార్యదర్శి కోలార్ వెంకటేష్, సీనియర్ నాయకులు యతీశ్వర్ రెడ్డి, శేఖర్ మరియు జన సైనికులు పాల్గొన్నారు.