మండపేట ( జనస్వరం ) : వైసీపీ ప్రభుత్వంలో ఉన్న కాపు మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను విమర్శించడానికి సమావేశమవడాన్ని వ్యతిరేకిస్తూ ఎంపీటీసీ గొల్లపల్లి అనురాధ మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేస్తూ నిరసన తెలియచేసారు జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ కాపు ప్రజా ప్రతినిధులంతా ముందు కాపులకు ఇచ్చిన హామీలను అమలు పరిచేలా మీ జగన్మోహనరెడ్డిని నిలదీసి అప్పుడు మాట్లడాలని, ప్రతి సంవత్సరం కాపు కార్పోరేషన్ కు 2000కోట్ల రూపాయిలు జమచేసి ఖర్చుపెడతానన్న హామీ ఏమైందని, అలాగే ఈ డబ్ల్యుసి కింద కాపులకు గత ప్రభుత్వం ఇచ్చిన 5% రిజర్వేషన్స్ ఎందుకు అమలు చేయడం లేదో అడగాలనికోరారు. అదేవిధంగా గత అసెంబ్లీ కాపులను బిసిల్లో చేర్చాలని ఏకగ్రీవంగా తీర్మానించి కేంద్రానికి పంపిన తీర్మానం ఏమైదని మీ అధినేతను అడిగి కాపు కులానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. అప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించండి. అంతే గాని మీ ఇష్టానుసారం మా నాయకుని పై అవాకులు చెవాకులు పేలితే చూస్తూ ఊరుకోబోమని, రేపు కాపుల ఓట్లు అడగడానికి ఎలా వస్తారో చూస్తామని వారిని హెచ్చరించారు.