గుత్తి ఆర్టీసీ డిపో అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండించిన వాసగిరి మణికంఠ

వాసగిరి మణికంఠ

         గుత్తి ( జనస్వరం ) : అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ పత్రికాముఖంగా మాట్లాడుతూ లక్షల రూపాయలు ఆదాయం ఉన్న గుత్తి బస్టాండ్ లో ప్రయాణికులకు కనీస సౌకర్యాలు లేకపోవడం శోచనీయం అన్నారు. ముఖ్యంగా బస్టాండ్ పైకప్పు కూలి పెచ్చులూడి పడడంతో ప్రయాణికులకు తీవ్ర గాయాలయి ఇబ్బందులు పడుతున్న ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులు ముద్దు నిద్రలో ఉంటూ ఏమాత్రం పట్టించుకోని వైనాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. సెస్ పేరిట డీజిల్, పెట్రోలు రేట్లు పెంచడంలోను మరియు ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచడంలో ఉన్న శ్రద్ధ రోడ్లు వేయడంలోనూ, పాత బస్సులు స్థానంలో కొత్త బస్సులు ఏర్పాటు చేయడంలోనూ దృష్టిపెట్టాలని దశాబ్దాల చరిత్ర కలిగిన గుత్తి ఆర్టీసీ బస్టాండ్ లో వాణిజ్య కార్యకలాపాల నిమిత్తం ఉన్న స్థలాలను లీజుకు ఇచ్చిన ఆర్టీసీ అధికారులు ఆదాయాన్ని పొందుతున్నారు తప్ప, సంస్థ ద్వారా వచ్చిన ఆదాయంలో 10% కూడా ప్రయాణికుల సౌకర్యాల కోసం వినియోగించడం లేదు. కేవలం గుత్తి ఆర్టీసీ డిపో అధికారులకు ఆదాయం పెంపుపై ఉన్న శ్రద్ధ ప్రయాణికుల క్షేమం మరియు సౌకర్యాలు పట్ల లేదు. శిథిలావ్యస్థకు చేరుకున్న ఆర్టీసీ బస్టాండును పునర్ నిర్మించాలని మరి ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం వారు మూడు రాజధానులు కడతాం, జిల్లాకు ఒక ఏర్పోర్ట్ కడతామని ప్రగల్బాలు పలకడం కాదు మొదట ఉన్న బస్టాండ్ లని బాగు చేయండి అని హితవు పలికారు. లేని పక్షంలో జనసేన పార్టీ ప్రజల పక్షాన గుత్తి పట్టణంలో శిథిలావ్యస్థలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ పునర్ నిర్మించే వరకు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way