నూజివీడు, (జనస్వరం) : ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ పరిధిలో ముసునూరు మండల పరిధిలోని బలివే గ్రామంలో ఎన్నో ఏళ్ల నుండి తమ్మిలేరు నది మీద ప్రయాణికులకు, ఇతర ప్రాంతాల నుండి బలివే రామస్వామి వారి క్షేత్రానికి విచ్చేసే భక్తులకు ఇబ్బందులు గురికావడం, అలానే ప్రధాన రహదారికి విద్యార్థులు, ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని నిత్యం అదే ప్రవాహం దాటి వెళ్తున్న సందర్భంలో గతంలో గ్రామస్తులు అనేక సార్లు ఈ సమస్య గురించి అధికారులకు ప్రజా ప్రతినిధులకు అర్జీలు పెట్టిన పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇసుక మాఫియా మీద పెట్టే శ్రద్ద ప్రజల సమస్యల మీద పెట్టాలని ముసునూరు ఎంపిడివోకి నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు పాశం నాగబాబు అధ్వర్యంలో బలివే గ్రామ యువతతో కలిసి స్థానిక నాయకులతో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన నాయకులు చేబత్తిన విజయ్, గిరి గోపికృష్ణ, యాదల మహేంద్ర, రాము, చేకూరి అనిల్, బయ్యం సతీష్, రాజబోయిన సుబ్బు యాదవ్, కేశవ, యలబాక నరసింహ తదితరుల పాల్గొన్నారు.