Search
Close this search box.
Search
Close this search box.

జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుని కలిసిన జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి

జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుని కలిసిన జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి

             పెన్నా నదికి పోటెత్తిన వరద సహజసిద్ధంగా ఏర్పడింది కాదని సోమశిల నిర్వహణా తీరు సరిగ్గా లేకపోవడం, జలవనరుల శాఖ మితిమీరిన పోకడలే కారణం అంటూ నేడు జిల్లా కలెక్టర్ క్యాంపు ఆఫీసులో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుని కలిసి జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఫిర్యాదు చేసారు.

కేతంరెడ్డి కామెంట్స్:

⇨ఈ ఏడాది జూన్ 12 వరకు ఎలాంటి నీటి ఇన్ ఫ్లో లేని సోమశిల జలాశయానికి 27 టీఎంసీల నీరు ఉన్న సమయంలో జూన్ 13 వ తేదీ నుండి కృష్ణానదికి ఏర్పడిన వరదల కారణంగానూ, క్యాచ్ మెంట్ ప్రాంతంలో నమోదైన వర్షపాతం కారణంగానూ ఇన్ ఫ్లో ప్రారంభం అయిందన్నారు.

⇨ఆగష్టు 21 వ తేదీ నాటికి 30 టీఎంసీల స్టోరేజి కాగానే కొద్దిమేర కండలేరు జలాశయంకి వదిలే చర్యలు ప్రారంభించారని, ఆగష్టు 26 వ తేదీ నాటికే ఆ స్టోరేజి 40 టీఎంసీలు దాటిందని, భవిష్యత్తులో మరింత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది కనుక కండలేరుకి పూర్తి స్థాయి నీటిని వదిలే అవకాశం ఉన్నాకూడా సెప్టెంబర్ 5 వ తేదీ నాటికి కూడా పూర్తిస్థాయిలో వదల్లేదని, ఈ కారణంగా ఎప్పుడో నిండాల్సిన కండలేరు కూడా పూర్తి స్థాయిలో నిండలేదని దుయ్యబట్టారు.

⇨సెప్టెంబర్ 13 నుండి సోమశిలలోకి వరద నీటి ఉధృతి పెరిగిపోయి రోజుకి 7 టీఎంసీల వరకు నీరు వచ్చి చేరుతూ సెప్టెంబర్ 15 నాటికి 70 టీఎంసీలు దాటే సరికి అధికారులు ఉక్కిరిబిక్కిరి అయ్యారన్నారు.

⇨వాటర్ కుషన్ లెవెల్ 65 టీఎంసీలు కాగా సెప్టెంబర్ 14 న కొద్దిమేర గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. కానీ అధికారులు ఎందుకు నీటిని విడుదల చేయలేదని ప్రశ్నించారు.

⇨సెప్టెంబర్ 15 న నీటి విడుదలకు ప్రణాళిక రూపొందించుకోగా గేట్లు ఆపరేట్ చేసే హైడ్రాలిక్ సిస్టమ్ పనిచేయలేదన్నారు. దానికి కారణం 30 సంవత్సరాల క్రితం కొన్న 25వేల రూపాయలు విలువచేసే విద్యుత్ కేబుల్ కాలిపోవడం అన్నారు. ఈ హైడ్రాలిక్ సిస్టమ్ పనిచేయనప్పుడు డ్యామ్ పైన ఉండే రెండున్నర కోట్ల రూపాయలు విలువచేసే గ్రాంటీ క్రేన్ ను స్టాప్ లాక్ గేట్లు తెరవడానికి ఉపయోగిస్తారని, కానీ ఇది కూడా గత కొన్నేళ్లుగా పనిచేయని స్థితిలో ఉందన్నారు.

⇨ఈ కారణంగా సరైన క్రమంలో గేట్లు తెరుచుకోనందువల్ల సెప్టెంబర్ 15 న నీటి ఒత్తిడి అధికంగా ఉందని తెలిసి, పద్ధతి ప్రకారం ఎత్తకూడనటువంటి డ్యామ్ కు ఎడమ వైపునున్న ఒకటో గేటును తెరిచి 3 టీఎంసీల వదిలేరన్నారు. ఈ నీటిని ఇలా వదిలినందువల్ల ఏడున్నర కోట్ల రూపాయలు విలువచేసే ఎడమవైపు రివిట్ మెంట్ 150 మీటర్ల మేర దెబ్బతినిందన్నారు.

⇨సెప్టెంబర్ 16 వ తేదీ నాటికి సోమశిలలో పూర్తిస్థాయి సామర్ధ్యం కల్గిన 78 టీఎంసీలకు స్టోరేజీ చేరుకుందని, డ్యామ్ ప్రమాదం అంచుల్లోకి వెళ్లిందన్నారు.

⇨సోమశిల నీటి ఇన్ ఫ్లో రీడింగ్ తీసే ప్రాంతాలు రాజోలుబండ, ఆదినిమ్మాయపల్లె, చెన్నూరు. ఈ మూడు ప్రాంతాల్లో రీడింగ్ తీస్తూ డ్యామ్ లో వాటర్ కుషన్ లెవల్ ను బ్యాలన్స్ చేసుకుంటూ ఉండాలన్నారు. కాగా వరద ఉదృతంగా వస్తూ ఉన్నా కూడా సోమశిల అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ ప్రాంతాల్లో రీడింగ్ ను తీయలేదన్నారు.

⇨ఇలా సోమశిల జలాల విషయంలో సరైన నీటి నిర్వహణ అవగాహన లేకుండా, సరైన సమయంలో కండలేరుకి పూర్తిస్థాయి ఔట్ ఫ్లో పంపకుండా, సముద్రంలోకి వృథాగా నీటిని విడుదల చేస్తూ పైగా అదేదో తమ ఘనకార్యం అయినట్టు డ్రోన్ ద్వారా వీడియో షూట్ చేయించారని తెలిపారు.

⇨దీనికి కారణం అయిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మరియు కృత్రిమ ముంపు కారణంగా నష్టపోయిన రైతులకు, బాధితులకు లక్ష రూపాయల పరిహారం అందించాలని డిమాండ్ చేసారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పావుజెన్ని చంద్రశేఖర్ రెడ్డి, కాకు మురళి రెడ్డి, బొబ్బేపల్లి సురేష్, హేమంత్, కార్తీక్, చందు, సూరి, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం
కందుకూరు
కందుకూరు గ్రామంలో వాటర్ ట్యాంక్ క్లీన్ చేసిన సిబ్బంది
కందుకూరు
కందుకూరు గ్రామ పంచాయితీలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way