పుట్టపర్తి ( జనస్వరం ) : పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని పుట్టపర్తి మండలోని మేజర్ పంచాయితీ అయినటువంటి పెడబల్లి జనసేన పార్టీ కార్యాలయంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు తలారి పెద్దన్న రెండు తీర్మానాలను ప్రవేశపెట్టడం జరిగింది. అందులో 1. జనసేన పార్టీని పార్టీ యొక్క సిద్ధాంతాలను మరియు 2024 లో వచ్చే సార్వత్రిక ఎలక్షన్ల కోసం జనసేన పార్టీ యొక్క మేనిఫెస్టోలోని కొన్ని కొన్ని అంశాలను పవన్ కళ్యాణ్ గారు ప్రకటించినటువంటి షణ్ముఖ వ్యూహంలోని అంశాలను ప్రతి గడపగడపకు వెళ్లి వివరించాలని తెలియజేయడం జరిగింది. 2. త్వరలో రాబోయే క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జనసేన పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్త మరియు ప్రతి అభిమానికి ఈ సభ్యత్వం వల్ల జరిగే ఉపయోగాలను వివరించి ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వివరించడం జరిగింది. పై రెండు తీర్మానాలను ప్రతి ఒక్క కార్యకర్త ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి మండల అధ్యక్షుడు తలారి పెద్దన్న, పుట్టపర్తి జనసేన నాయకులు గడ్డం వెంకటేష్ నాయక్, శ్యాంసుందర్, రవి నాయక్, రమణ, కృష్ణ, మురళి, శ్రీకాంత్ నాయక్, పరమేష్ నాయక్, బాబు నాయక్ శ్యాంసుందర్ నాయక్, పృథ్వి, సుహేల్ తదితరులు పాల్గొన్నారు.