విజయవాడ, (జనస్వరం) : కార్తీక మాసం సందర్భంగా పాత శివాలయంలో తగిన ఏర్పాట్లు చేయాలని విజయవాడ సిటీ వైడ్ చిరంజీవి యువసేన అధ్యక్షులు పులిచేరి రమేష్ బాబు, పాత శివాలయం మాజీ ధర్మకర్త జనసేనపార్టీ నాయకులు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ 37వ డివిజన్ అధ్యక్షులు రాముగుప్తాలు అన్నారు. ఆదివారం పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేనపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయవాడ నగర అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ పోతిన వెంకట మహేష్ సూచనలు మేరకు విజయవాడలో అతి పురాతనమైన దేవాలయం శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం పాత శివాలయం ఈనెల 26వ తేదీ నుండి ప్రారంభమవుతున్న కార్తీక్ మాసం ఉత్సవాలకు ప్రజలు పెద్ద ఎత్తున దేవస్థానానికి వచ్చే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాల నుండి కోవిడ్ కారణంగా ఈ కార్యక్రమాలకు ప్రజలు దూరంగా ఉండటం వల్ల ఈ సంవత్సరం పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. భక్తులందరికీ సౌకర్యంగా ఉండేటటువంటి ఏర్పాట్లను చేయాలని దేవస్థానం వారిని కోరారు. అలాగే దేవస్థానంలో దర్శనం, అభిషేకం టికెట్లు రేట్లు పెంచి భక్తులకు దేవుడిని దూరం చేయొద్దని కోరారు. అలాగే దేవాలయంలో ఈఓ ఆఫీస్ పక్కన కోటిలింగాల ఉపాలయంలో ఆర్థిక స్తోమత లేనటువంటివారు ఆ దేవాలయంలో నీటితో అభిషేకం చేసుకుంటారని, వాటికి టికెట్ నిర్వహించటం సబబు కాదని పేర్కొన్నారు. కార్తీక్ మాసంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి అన్నదానం నిమిత్తం మైక్ అనౌన్స్ చేస్తూ విరాళాలు సేకరిస్తున్నారని, ఆ విరాళాలతో అన్నదానం చేస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రతి రోజు అన్నదాన కార్యక్రమాలు లేవు కానీ కార్తీక మాసంలో చివరి రోజు జరిగే అన్నసంతర్పణ కార్యక్రమానికి ప్రత్యేక దాతలు దగ్గర నుంచి వసూలు చేసి అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తారని తెలియజేశారు. అన్నదానం నిమిత్తం విరాళాలుగా వసూలు చేస్తున్న డబ్బును ఏమి చేస్తున్నారో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. విరాళా రూపంలో వసూలు చేస్తున్న డబ్బుని దేవస్థానంలో సద్వినియోగంగా వినియోగించాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేశారు. దేవాలయంలో అతి పురాతనమైనటువంటి విగ్రహాలను ధ్వంసం చేసి దాతల దగ్గర విగ్రహం ధ్వంసం అయిందని, ఈ విగ్రహాన్ని మీరు ప్రతిష్టిస్తే మీ కుటుంబంలో చాలా బాగుంటాయని దాతలు నమ్మించి సుమారుగా రూ.లక్ష అయ్యే ఖర్చుకి ఐదు లక్షలు వసూలు చేస్తున్నారని, బాగున్న విగ్రహాలను డామేజ్ చేయడం ఇది కరెక్ట్ కాదని వారు తెలియజేశారు. ఇప్పటికే ఈ దేవాలయంలో అక్రమలు జరుగుతున్నాయని భక్తుల అభిప్రాయపడుతున్నారు. అతి పురాతనమైన ఈ దేవాలయ ప్రతిష్ట పాడు చేయకూడదని కోరారు.